ఖైదీకి 85 కోట్లు ఫిక్స్ చేసిన 'ఈనాడు'?

చిరంజీవి నటిస్తున్న 'ఖైదీ నంబర్ 150' సినిమాకు రూ.85 కోట్లు వ్యాపారం జరగనుందంటూ 'ఈనాడు' దిన పత్రిక రేట్ ఫిక్స్ చేసింది. ఏ కారణాల వల్ల ఈ అంచనాకు వచ్చిందని మాత్రం ఆ పత్రిక పేర్కోలేదు. శనివారం నాడు 'ఇది వ్యాపార సమయం' అంటూ వండి వార్చిన కథనంలో చిరంజీవి సినిమా బిజినెస్ పై మాత్రం లెక్కలు తేల్చారు. అయితే ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న మేరకు 'ఖైదీ..' చిత్రానికి సంబంధించి కేవలం వైజాగ్ ప్రాంతానికి మాత్రమే బిజినెస్ జరిగిందట. మెుత్తం ఆంధ్ర ప్రదేశ్ లో 35 కోట్ల బిజినెస్ జరవచ్చని ఒక అంచనా, సీడెడ్, తెలంగాణ ఏరియాలపై ఇంకా స్పష్టత లేదు. పైగా తెలంగాణ లో భారీ రేట్ ఆశించడం లేదా గీతా ఆర్ట్స్ ద్వారా పంపిణీ చేసే విషయం చర్చల దశలో ఉంది. అయినప్పటికీ 'ఈనాడు' ఎలాంటి ఆధారాలతో ఖైదీ.. చిత్రానికి  85 కోట్ల బిజినెస్ జరుగుతుందని రాసిందో అర్థం కావడం లేదు. 

ఇక బాలకృష్ణ నటిస్తున్న 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రానికి కేవలం సగం వ్యాపారం మాత్రమే జరిగిందని రాస్తూ, నాగార్జున, వెంకటేశ్ సినిమాలకు మాత్రం ట్రేడ్ ఎంక్వయిరీలు జరుగుతున్నట్టుగా కథనంలో తేల్చారు. ఇదంతా చదువుతుంటే కేవలం చిరంజీవి సినిమాకు అనుకూలంగా అంకెలు వేయడానికే కథనం ప్రచురించారని స్పష్టమవుతోంది. ఒక హీరోను గొప్పగా చెప్పుకునే ప్రయత్నంలో మిగతా హీరోలను చిన్నబుచ్చి తద్వారా అభిమానుల్లో అసంతృప్తి కారణమయ్యారనే మాట వినిపిస్తోంది. 

khaidi number 150 movie
gowthami putra satakarni movie
eenadu paper
business
chiranjeevi
balakrishna
venkatesh
nagarjuna