క్రిష్ గారూ శ్రియ బర్త్ డే మరిచారా?

'గౌతమిపుత్ర శాతకర్ణి' ఫస్ట్ లుక్  గెటప్ రిలీజ్ చేసిన అనంతరం విజయదశమికి టీజర్ విడుదల చేశారు. ఆదివారం (అక్టోబర్ 16) హేమమాలిని బర్త్ డే కావడంతో ఆమె ఫస్ట్ లుక్ సైతం మీడియాకు రిలీజ్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇదే సినిమాలో శాతకర్ణికి భార్యగా, బాలకృష్ణకు జోడిగా నటిస్తున్న సీనియర్ నటి శ్రియ లుక్ మాత్రం ఆమె బర్త్ డేకు రిలీజ్ చేయకపోవడం గమనార్హం. సెప్టెంబర్ 11న శ్రియ బర్త్ డే వచ్చి వెళ్లిపోయింది. మరి శ్రియ లుక్ ఎందుకని బయటపెట్టలేదో దర్శకుడు క్రిష్ చెప్పాలి.  హేమమాలిని విషయంలో పాటించిన సెంటిమెంట్ శ్రియ విషయంలో ఎందుకులేదో!!. దక్షిణాదిలో అనేక చిత్రాల్లో నటించిన శ్రియకు ఆ మాత్రం గుర్తింపు లేదని అనుకోవాలా లేక సినిమాలో ఆమె పాత్రకు తగిన ప్రాథాన్యత లేదా? ఈ డౌట్స్ చాలామందిలో ఉన్నాయి. చరిత్ర ప్రకారం శాతకర్ణి తల్లి పాత్రకే ఇంపార్టెన్స్ ఎక్కువ. పైగా ఆ పాత్ర పోషిస్తోంది డ్రీమ్ గర్ల్ హేమమాలిని కావడం వల్ల అందరిలో ఆసక్తి కనిపిస్తోంది.  అయితే హీరోయిన్ విషయంలో మాత్రం దర్శకుడు నిర్లక్షం చేశాడు. శ్రియ బర్త్ డేనే మరిచారు.

director krish
gowthamiputra satakarni
shriya birthday look
hemamalini birthday look
balakrishna