బన్నీకి చెక్ పెట్టిన సూర్య!

సరైనోడు సరదాకి చెక్ పడింది. శుక్రవారం వచ్చిన 24 చిత్రం కమర్షియల్ గా మంచి విజయం సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సూర్య నటించిన 24 మరో గజినిలాగా రికార్డ్ సృష్టించే దిశగా టాక్ ఉంది. భారీ వ్యయంతో తీసిన 24లో కొత్తదనం ఉంది. ఇది రెగ్యులర్ మాస్ సినిమా కాదు. అందువల్ల యువ ప్రేక్షకులు సూర్య నటించిన చిత్రాన్ని చూడ్డానికే మొగ్గుచూపుతారు. దీనివల్ల సరైనోడు సర్దుకోవాల్సిందే. బన్నీ హడావుడికి సూర్య చెక్ పెట్టినట్టుగానే భావించాలి.
బన్నీ నటించిన సరైనోడు కు కలక్షన్లు బాగా వస్తున్నాయని ఏకపక్షంగా జరిగిన ప్రచారానికి తెరపడినట్టే అని సినీ వర్గాలు అంటున్నాయి. తొలుత ఎవరేజ్ టాక్ వచ్చినా దాన్ని హిట్ సినిమా వరకు అల్లు అరవింద్ తీసుకెళ్ళడానికి నానా తంటాలు పడ్డారు. సొంత సినిమా, సొంత కొడుకు నటించింది కావడంతో హైప్ తేవడానికి కష్టపడ్డారు. నిర్మాణసమయంలో పక్కన పెట్టేసిన దర్శకుడు బోయపాటి శ్రీనును ఆకాశానికెత్తేశారు. ఇంతచేస్తే కమర్షియల్ గా మాత్రం ఓ.కె. అనిపించుకున్నాడు సరైనోడు. ఇక ఈ సినిమా ఏ మేర కలెక్ట్ చేసింది అనే దానిపై తికమక లెక్కలున్నాయి. 50 కోట్లు దాటలేదని ట్రేడ్ వర్గాలు అంటుంటే సినీ సంబంధికులు మాత్రం 70 కోట్లని ప్రచారం చేసుకుంటున్నారు. లెక్కలు చెప్పాల్సింది బయ్యర్లు. అయితే ఈ సినిమాకు బయ్యర్లు లేరు గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారానే రిలీజ్ చేశారు.ఇలాచేయడం కూడా వ్యూహంలో భాగమే. బన్నీ మార్కెట్ పరిధిని పెంచి చూపించడానికి సొంతంగా రిలీజ్ చేశారని సినీ వర్గాలు అనుమానిస్తున్నాయి.
ఇకపోతే విజయవాడలో బ్లాక్ బస్టర్ వేడుక నిర్వహిస్తే ఎలాంటి మైలేజ్ రాలేదు. ఆంధ్రలో తగ్గిపోతున్న కలక్షన్లను పెంచుకోవడానికి చేసిన బ్లాక్ బస్టర్ ప్రయత్నం బెడిసికొట్టింది.







































