ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
అనుష్క నాజర్ కూతురట!

రీసెంట్ గా తమిళ నడిగర్ సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన నాజర్ సైజ్ జీరో సినిమా తమిళ ఆడియో వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో నాజర్ అనుష్క గురించి సైజ్ జీరో సినిమా కోసం తను పడ్డ కష్టం గురించి చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. అనుష్క నా కూతురని, తనని నేను దత్తత తీసుకున్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నాకు ఈ ఆడియో వేడుకకు ఎలాంటి సంబంధం లేదని అనుష్క తండ్రిగా ఈ కార్యక్రమానికి వచ్చానని ఆయన తెలిపారు. ఈ చిత్రంలో అనుష్క మేకప్ వేసుకోకుండా నిజంగా బరువు పెరిగిందని నటన పట్ల తనకున్న డెడికేషన్ మరెవరికి లేదని ఆయన చెప్పారు.
nazar
anushka shetty
size zero movie
audio function







































