రేపే ఎన్టీఆర్‌ కొత్త సినిమా ప్రారంభం!

శ్రీమంతుడు వంటి సూపర్‌హిట్‌ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌ చేయబోతున్న కొత్త సినిమా రేపు(25) ప్రారంభం కాబోతోంది. మహేష్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమంతుడు చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది. 

ఎన్టీఆర్‌ కోసం కొరటాల శివ చాలా ఎక్స్‌ట్రార్డినరీ సబ్జెక్ట్‌ రెడీ చేశాడట. ఎన్టీఆర్‌ ఇమేజ్‌కి ఈ కథ అద్భుతంగా వుంటుందని ఎన్టీఆర్‌ సన్నిహితులు చెప్తున్నారు. పూర్తి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ సినిమా ఎన్టీఆర్‌కి మరో సూపర్‌హిట్‌ చిత్రం అయ్యే అవకాశం కనిపిస్తోంది. 

ntr new movie opening
ntr and koratala siva combo movie
ntr movie opening on sunday