సంతోషమే సగం బలం అంటోన్న సునీల్‌...!

సునీల్‌ కెరీర్‌ మరలా గాడిలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన దిల్‌రాజు బేనర్‌లో వాసువర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈచిత్రానికి ‘కృష్ణాష్టమి’ అనే టైటిల్‌ను అనుకొంటున్నారు. అదే సమయంలో సునీల్‌ మరో సినిమా కూడా పట్టాలెక్కనుంది. వర్మ శిష్యుడైన వంశీ ఆకెళ్ల దర్శకత్వంలో సునీల్‌ ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఆయన ‘ఓనమాలు, మళ్లీమళ్లీ ఇది రాని రోజు’ చిత్రాల దర్శకుడు, క్లాస్‌ డైరెక్టర్‌గా, ఫీల్‌గుడ్‌ మూవీలను తెరకెక్కించడంలో మంచి పేరున్న దర్శకునిగా ఎదుగుతున్న క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో సునీల్‌ ఓ సినిమా చేయనున్నాదు. ఈ చిత్రానికి ‘సంతోషం సగం బలం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. 

sunil
santhoshame sagam balam
kranthi madhav