2014 జీరో హీరోలు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రభాస్ అభిమానులు ఈ సంవత్సరం తమ హీరోల సినిమాలు రిలీజ్ అవకపోవడం వల్ల నిరాశ చెందారు. పవన్ కళ్యాణ్ 'జనసేన', రాష్ట్ర రాజకీయాలలో బిజీ గా ఉండడం వల్ల తన రెండు సినిమాలు 'గోపాల గోపాల' , 'గబ్బర్ సింగ్ 2' వాయిదా పడ్డాయి. అయితే 2015 సంవత్సరంలో రిలీజ్ కానున్న ఈ రెండు సినిమాలతో ప్రేక్షకులను కనువిందు చేయడం కాయం. ప్రభాస్ గత రెండు సంవత్సరాలుగా 'బాహుబలి' షూటింగ్ తో బిజీ గా ఉండడం వల్ల వేరే ప్రాజెక్ట్ చేపట్టలేదు. దీని వల్ల ఈ సంవత్సరం తను ఎలాంటి సినిమా రిలీజ్ చేయకపోయినా అభిమానులు మాత్రం పట్టించుకోకుండా 'బాహుబలి' చిత్రం తో ప్రభాస్ కి లైఫ్ టైమ్  గుర్తుండిపోయే ఫేమ్ వస్తుందని ఆశిస్తున్నారు. ఎనర్జటిక్ స్టార్ రామ్ కూడా ఈ సంవత్సరం తన సినిమా ని రిలీజ్ చేయడం లో ఫెయిల్ అయ్యారు. ఫిబ్రవరి లో రిలీజ్ కానున్న తన సినిమా 'పండగ చేస్కో' బ్లాక్ బాస్టర్ అవ్వాలని కోరుకుందాం.

pawan kalyan
prabhas
release
janasena
gopala gopala
bahubali
raam
pandaga chesko
february