ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
3 ముక్కల్లో రొమాన్స్ గురించి చెబుతారట.!

ప్రసిద్ధ నేపథ్య గాయకులు ఎస్.పి. బాలసుబ్రహ్మణం కుమారుడు, ప్రముఖ గాయకుడు ఎస్.పి. చరణ్ నిర్మాతగా కాపిటల్ ఫిల్మ్స్ వర్క్స్ పతాకంపై తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం \'మూడు ముక్కల్లో చెప్పాలంటే...\'. ప్రముఖ రచయిత వెన్నెలకంటి రెండో కుమారుడు రాకేందు మౌళి హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో అదితి కథానాయిక. మధుమిత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది.
బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, రాజా రవీంద్ర, కాదంబరి కిరణ్, వెంకీ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: కార్తికేయ మూర్తి, ఎడిటింగ్: కిరణ్ గంటి, కెమెరా: శ్రీనివాస్, ఆర్ట్: మోహన్ జీ.
telugu movie moodu mukkallo cheppalante
moodu mukkallo cheppalante movie news
moodu mukkallo cheppalante movie progress
moodu mukkallo cheppalante producer s.p.charan
moodu mukkallo cheppalante movie hero rakendu mouli
vennelakanti son rakendu mouli







































