ఈ యువ హీరో కోలుకోవడం కష్టమే!
Why Sandeep Kishan’s Comeback Looks Difficult
ప్రస్థానం చిత్రంలో నెగటివ్ రోల్ తో ప్రేక్షకుల మనసులో నిలిచిపోయిన యువ హీరో సందీప్ కిషన్ ఆ తరవాత హీరోగా పలు చిత్రాల్లో నటించారు. కానీ ఈమధ్యన సందీప్ కిషన్ టైమ్ అస్సలు బాగోలేదు. ఏ సినిమా చేసినా అది సందీప్ ని డిజప్పాయింట్ చేస్తుంది తప్ప హిట్ మాత్రం దక్కడం లేదు.
ఆఖరికి డిజిటల్ ఎంట్రీ ఇచ్చినా పని జరగలేదు. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ కోసం సందీప్ కిషన్ సూపర్ సుబ్బు అంటూ చేసిన వెబ్ సిరీస్ కూడా ఆడియన్స్ లో ఇంపాక్ట్ కలగచేయలేదు. కోలీవుడ్ స్టార్ కమ్ సీఎం విజయ్ జాసన్ దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతూ సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన సిగ్మా చిత్రం కూడా సందీప్ కిషన్ ను నిరాశపరిచింది.
ఈ చిత్ర ప్రమోషన్స్ లో యాక్టీవ్ గా పాల్గొన్న సందీప్ కిషన్ గత కొన్ని రోజులుగా నన్ను, నా సినిమా (సిగ్మా)ని లక్ష్యంగా చేసుకుని చాలా వ్యతిరేక ట్వీట్లు వస్తున్నాయి. వీటి వెనుక ఎవరున్నారో, ఇందుకోసం ఎవరు డబ్బులు చెల్లిస్తున్నారో నాకు పూర్తిగా తెలుసు.. అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు.
సందీప్ ఎవరిని బ్లేమ్ చెయ్యక్కర్లేదు. కారణం సిగ్మా ఫుల్లీ అవుట్ డేటెడ్ కంటెంట్ అంటూ ఆడియన్స్ సిగ్మా చిత్రాన్ని తిరస్కరించారు. సిగ్మా చిత్రానికి పూర్ రివ్యూస్, ఆడియన్స్ నుంచి నెగెటివ్ రెస్పాన్స్ కనిపించింది. మరి ఈ చిత్రంపై ఎన్నో హోప్స్ పెట్టుకున్న సందీప్ కిషన్ కి సిగ్మా బిగ్ షాక్ ఇచ్చింది అనే చెప్పాలి.
















































