మెగాస్టార్ బర్త్ డే కి అదిరిపోయే ట్రీట్

Mega Treat On Chiranjeevi birthdayMega Treat On Chiranjeevi birthday

 

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఈ నెలలోనే. ఆగస్టు 22 ఆయన బర్త్ డే కి మెగా ఫ్యాన్స్ సంబరాలతో పాటుగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వచ్చే ట్రీట్స్ తో సోషల్ మీడియా ని షేక్ చేసేలా అభిమానుల ప్లాన్స్ ఉంటాయి. చిరు ఎప్పుడో నటించిన విశ్వంభర అప్ డేట్ చిరు బర్త్ డే కి ఉంటుంది అని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

దానితో పాటుగా మెగాస్టార్ చిరు-బాబీ కలయికలో రెండో మూవీగా తెరకెక్కుతున్న చిరు 158 చిత్రం నుంచి టైటిల్ తో పాటుగా టీజర్ ని బాబీ ప్లాన్ చేసున్నాడనే న్యూస్ వైరల్ అవుతోంది. చిరు 158 షూటింగ్ మొదలయ్యాక దర్శకుడు బాబీ చిరు ని పరుగులు పెట్టిస్తున్నాడు. రీసెంట్ గా చిరు రామ్ చరణ్ సర్జరీ కోసం మూడురోజులు కోయంబత్తూరు వెళ్లొచ్చారు.

దర్శకుడు బాబు చిరు 158 టైటిల్ తో పాటుగా టీజర్ కానీ, పవర్ ఫుల్ గ్లింప్స్ ని కానీ ప్లాన్ చేస్తున్నాడట. సో మెగా ఫ్యాన్స్ కి చిరు 158 నుంచి అదిరిపోయే ట్రీట్ ఖాయం. ఈ చిత్రం 2027 సంక్రాంతి టార్గెట్ గా తెరకెక్కుతుంది. 
 

Chiranjeevi birthday Special