రామాయణ ట్రైలర్ రికార్డుల మోత
Ramayana Trailer Creates History
రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా, నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణ: పార్ట్ 1' ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే అధికారిక ప్లాట్‌ఫార్మ్‌లలో 350 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందనతో ఈ చిత్రం 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
ట్రైలర్‌కు సినీ అభిమానులు, విమర్శకులు, సెలబ్రిటీలు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా భారీ స్థాయి విజువల్స్, వరల్డ్ క్లాస్ VFX, భావోద్వేగభరితమైన కథనం, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా "Our Truth. Our History." అనే థీమ్ ప్రేక్షకులను బలంగా ఆకట్టుకుంది. భారతదేశపు గొప్ప ఇతిహాసాన్ని అత్యంత గౌరవంతో, ప్రామాణికంగా, భారీ స్థాయిలో తెరపై ఆవిష్కరించారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.
ట్రైలర్‌లో మరో ప్రధాన ఆకర్షణ స్టార్ కాస్టింగ్. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్ శక్తివంతమైన నటనతో ఆకట్టుకోగా, రావణుడిగా యష్ తన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. సీతగా సాయి పల్లవి తన హుందాతనం, అమాయకత్వం, భావోద్వేగాలతో ప్రశంసలు అందుకుంటున్నారు. శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ లుక్ కూడా మంచి ఆసక్తిని రేకెత్తించింది. ఈ స్టార్ కాస్టింగ్ ట్రైలర్‌కు మరో పెద్ద బలంగా మారింది.
సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ గురించి ప్రత్యేకంగా ప్రశంసలు వస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి VFX, అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్, గ్రాండ్ సినిమాటోగ్రఫీ, ఎమోషన్స్‌ను మరింత ఎలివేట్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కలిసి ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించాయని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. దీంతో 'రామాయణ: పార్ట్ 1' పై అంచనాలు మరింత పెరిగాయి.
టెక్నికల్‌గా మాత్రమే కాదు... భారతీయుల అత్యంత పవిత్రమైన ఇతిహాసాన్ని ఎంతో నిజాయితీగా, గౌరవంతో, అత్యున్నత స్థాయిలో తెరకెక్కించారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. భక్తి, భావోద్వేగం, విజువల్ గ్రాండియర్‌ను అద్భుతంగా మేళవించిన ఈ ట్రైలర్ అన్ని తరాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ పూర్తి సినిమాను థియేటర్లలో చూడాలనే ఆసక్తిని పెంచుతోంది.
కేవలం రెండు రోజుల్లో 350 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన 'రామాయణ' ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఇప్పుడు 'రామాయణ: పార్ట్ 1' విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








































