Advertisement

శ్రీలంక లో దిగిన డ్రాగన్

NTR Dragon In Srilanka


యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలయికలో క్రేజీ పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్రం షూటింగ్ కి ఎన్టీఆర్ ఎలాంటి బ్రేక్ ఇవ్వడం లేదు. మూడు నాలుగు నెలలు వెయిట్ తగ్గేందుకు షూటింగ్ కి బ్రేకిచ్చిన తర్వాత ఇప్పుడు నీల్ తో కలిసి డ్రాగన్ షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నారు.

ఎన్టీఆర్ పుట్టినరోజు కి వదిలిన డ్రాగన్ గ్లింప్స్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ ట్రాన్ఫర్మేషన్ కి ఫ్యాన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11 న విడుదల కాబోతుంది. ప్రస్తుతం డ్రాగన్ టీమ్ శ్రీలంక లో దిగింది. అక్కడ అరుదైన లొకేషన్స్ లో డ్రాగన్ మాసివ్ యాక్షన్ సీన్స్ ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు.

ఎన్టీఆర్ తో పాటుగా విలన్ సగా నటిస్తున్న పలువూరు కీలక నటులు ఈ షెడ్యూల్ కోసం శ్రీలంక వెళ్లారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. 
 

Dragon In Srilanka