చేతికి పట్టీ-ఆందోళన వద్దంటున్న మెగాస్టార్
Chiranjeevi Says No Cause For Concernఇటీవల మెగాస్టార్ చిరంజీవి చేతికి పట్టీతో కనిపించడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు చక్కర్లు కొట్టగా, ఆయనకు ఏమైనా గాయమైయిందా? రాబోయే ప్రాజెక్టులపై ప్రభావం ఉంటుందా? అనే చర్చలు మొదలయ్యాయి. అయితే రూమర్స్ కి తావులేకుండా చిరంజీవి స్వయంగా ఎక్స్ (X) వేదికగా స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు.
ఎలాంటి పెద్ద ఆరోగ్య సమస్య లేదని, కేవలం చిన్నపాటి షోల్డర్ కీహోల్ సర్జరీ మాత్రమే జరిగిందని స్పష్టం చేశారు మెగాస్టార్. ఇది ముందస్తు జాగ్రత్తగా చేసిన సాధారణ ప్రక్రియ అని, ప్రస్తుతం తాను సాఫీగా కోలుకుంటున్నానని, సర్జరీను విజయవంతంగా నిర్వహించిన ప్రముఖ ఆర్థ్రోస్కోపీ నిపుణుడు డా. నితిన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
చేతికి పట్టీ ఉండటం గమనించి అభిమానులు, శ్రేయోభిలాషులు నా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఇది కేవలం చిన్నపాటి షోల్డర్ కీహోల్ సర్జరీ. ప్రస్తుతం నేను కోలుకున్నాను, నా దినచర్య సజావుగా సాగుతోంది. ఈ సర్జరీని ఎంతో నైపుణ్యంతో, సాఫీగా నిర్వహించిన అత్యుత్తమ ఆర్థోస్కోపీ సర్జన్ డాక్టర్ నితిన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు ❤️. ❤️ అని మెగాస్టార్ తన పోస్ట్ లో తెలిపారు.
రీజినల్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన మన శంకర వర ప్రసాద్ గారు తర్వాత చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. అలాగే దర్శకుడు బాబీతో మరోసారి చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నారు.
Sling Sparks Panic- Megastar Chiranjeevi Says No Cause For Concern







































