కమెడియన్‌కి ఎట్టకేలకు బెయిల్
Rajpal Yadav Gets Interim Bail In Cheque Bounce Caseప్రముఖ హాస్య నటుడు రాజ్‌పాల్ యాదవ్ చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. 5 కోట్ల అప్పు, దానిపై వడ్డీ కలుపుకుని 9 కోట్లు ఫైనాన్షియర్లకు చెల్లించాల్సి ఉండగా, ఆ మొత్తాన్ని తీర్చడంలో రాజ్ పాల్ విఫలమయ్యాడు. అతడు ఇచ్చిన చెక్కులన్నీ బౌన్స్ కావడంతో అతడిపై 2018లో కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులో తన ప్రామిస్ ని నిలబెట్టుకోవడంలో విఫలమైనందున కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అతడిని వచ్చి నేరుగా లొంగిపోవాల్సిందిగా ఆర్డర్స్ పాస్ చేసింది.
2012లో తన మొదటి దర్శకత్వ చిత్రం `అతా పతా లాపతా`కు సంబంధించిన కేసు ఇది. ఈ సినిమా విడుదలై అతడికి తీవ్ర నష్టాలను మిగిల్చింది. తాజాగా దిల్లీ హైకోర్టు అతడికి మధ్యంతర బెయిల్ ని మంజూరు చేసింది. అతడు కోర్టుకు 1.5 కోట్లు జమ చేసినందున తాత్కాలికంగా శిక్షను నిలుపదల చేసినట్టు కోర్టు పేర్కొంది. లక్ష పూచీకత్తు తో పాటు, అంతే మొత్తానికి షూరిటీని అతడు కట్టాలి. పాస్ పోర్టును కోర్టుకు అప్పగించాలని షరతులు విధించింది.
మార్చి 18న విచారణకు అతడు హాజరు కావాలి లేదా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడాలి. ఫిబ్రవరి 19న తన మేనకోడలి పెళ్లి జరగనుండగా, కోర్టు ఈ వెసులుబాటును కల్పించినట్టు తెలుస్తోంది. తదుపరి విచారణ తేదీ మార్చి 18 నాటికి మిగిలిన బకాయిని చెల్లించేందుకు అతడు తన ప్రణాళిక ఏమిటన్నది కోర్టుకు వివరించాల్సి ఉంటుంది. అయితే రాజ్ పాల్ అరెస్ట్ నేపథ్యంలో అతడికి పరిశ్రమ మద్ధతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఖాన్‌లు సహా పలువురు అతడికి కోటిన్నర వరకూ సాయం అందించినట్టు తెలిసింది.
Actor Rajpal Yadav received relief from the Delhi High Court







































