త్రిష కు నైనార్ నాగేంద్రన్ క్షమాపణ
Trisha slams Tamil Nadu BJP chief Nainar Nagenthranతమిళనాట హీరో విజయ్ ని రాజకీయంగా దిగార్చేందుకు బిజెపి నేతలు విజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మధ్యలో హీరోయిన్ త్రిష ను ఇందులోకి లాగడం పట్ల సర్వత్రా విమర్శలొచ్చాయి. హీరో విజయ్, నటి త్రిష తో డేటింగ్ లో ఉన్నాడు, ఆయన తన వైఫ్ కి విడాకులిచ్చి త్రిష ను పెళ్లి చేసుకోబోతున్నాడనే ప్రచారాన్ని బిజెపి అనుకూలంగా మార్చుకుని ఒక అడుగు ముందుకేసి విజయ్ ని త్రిష ని కలిపి బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట రాజకీయాల్లో దుమారాన్ని రేపాయి.
విజయ్‌కు రాజకీయ అనుభవం లేదు, అసలు విజయ్ ముందుగా తన ఇల్లు దాటి బయటకు రావాలి.. ముఖ్యంగా త్రిష ఇంటి నుండి బయటపడితేనే ఆయనకు అసలైన రాజకీయ వాస్తవాలు తెలుస్తాయి అంటూ చేసిన కామెంట్స్ పై నటి త్రిష ఫైర్ అయ్యింది, తన గురించి వస్తున్న అసభ్యకరమైన, అనుచితమైన వ్యాఖ్యలను నటి త్రిష తీవ్రంగా ఖండిస్తూ చేసిన ప్రకటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
త్రిష లాయర్ ఇచ్చిన ప్రకటనలో.. త్రిషకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, ఆమెకు ఫ్యూచర్ లో కూడా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని లాయర్ జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నటి త్రిష వ్యక్తిగత జీవితంపై పబ్లిక్ గా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని ఊహించలేదని పేర్కొన్నారు. తనకు సంబంధం లేని విషయాల్లోకి త్రిష ను లాగొద్దు అని లాయరు ప్రకటన ఇచ్చారు.
దానితో బిజెపి అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్.. త్రిష గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సింది, అందుకు తాను త్రిషకు క్షమాపణ చెబుతున్నట్టుగా ప్రకటించారు.
Trisha slams Tamil Nadu BJP chief Nainar Nagenthran remarks amid TVK Vijay row







































