BB 8: ఈసారి తప్పించుకోలేదు
BB 8: Hariteja doesnot escape this timeబిగ్ బాస్ సీజన్ 8 లో గత రెండు వారాలుగా వైల్డ్ కార్డు ఎంట్రీస్ అయిన రాయల్ క్లాన్ సభ్యులు మెహబూబ్, నయని పావని లు ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి వెళ్లిపోయారు. ఈ వారం మాత్రం ఎవరు నామినేషన్స్ లో ఉన్నప్పటికీ అందరూ టాస్క్ ల్లో ఇరగ్గొట్టేసారు. మెగా చీఫ్ కంటెండర్ షిప్ కోసం పలువురు హౌస్ మేట్స్ పోటీపడ్డారు.
ఇక ఈ వారం నామినేషన్ లిస్ట్ లో ఉన్న వారిలో గౌతమ్ కృష్ణ, యష్మి గౌడ, హరితేజ, విష్ణుప్రియ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీలు ఉన్నారు. అందులో గౌతమ్ నెంబర్ వన్ స్థానంలో ఓట్లు కొల్లగొడుతున్నారు. నిఖిల్ రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో ప్రేరణ, ఆతర్వాత యష్మి, విష్ణు ప్రియాలు ఉన్నారు.
ఇక ఈ వారం డేంజర్ జోన్ లో పృథ్వీ, హరితేజలు ఉన్నారు. గత వారం నయని పావనితో పాటుగా హరితేజలు డేంజర్ జోన్ లో ఉండగా నయని ఎలిమినేట్ అవ్వగా హరితేజ సేఫ్ అయ్యింది. ఇక ఈ వారం హరితేజ ఈసారి తప్పించుకునే ఛాన్స్ లేదు అంటున్నారు.
Hariteja is in the danger zone this week Bigg Boss







































