భగీరథకు వెంకయ్య నాయుడు అభినందనలు
former vice president of india Praises on writer and Journalist Bhagiradhaసీనియర్ జర్నలిస్ట్ , రచయిత భగీరథను భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అభినందించారు. మహానటుడు, తెలుగు దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా రామారావు గారితో చేసిన ఇంటర్వ్యూ లు , ఆయనతో వున్న అనుభవాలతో భగీరథ ‘మహానటుడు , ప్రజా నాయకుడు - ఎన్ .టి .ఆర్’ అన్న పుస్తకాన్ని వెలువరించాడు. శుక్రవారం హైదరాబాద్‌లో వెంకయ్య నాయుడుని కలిసి భగీరథ ఈ పుస్తకాన్ని ఆయనకి బహూకరించాడు.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు.. ఎన్.టి.ఆర్‌తో తనకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ ఎన్‌టిఆర్ చెరిగిపోని ముద్ర వేశారని, ఆయన ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. ‘మహా నటుడు , ప్రజానాయకుడు ఎన్.టి.ఆర్’ శత జయంతి సందర్భంగా ఆయన మీద ఓ పుస్తకాన్ని వెలువరించిన జర్నలిస్ట్, రచయిత భగీరథను అభినందిస్తున్నట్లుగా తెలిపారు.
Venkaiah Naidu Praises on writer and Journalist Bhagiradha








































