ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Chiranjeevi For Pakka Commercial Pre-release Event

పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ గెస్ట్ గా చిరు

Chiranjeevi For Pakka Commercial Pre-release Event

వరస విజయాలతో జోరు మీదున్న విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. బ‌న్నీ వాస్ నిర్మాత‌గా మ్యాచో హీరో గోపీచంద్‌తో చేస్తున్న పక్కా కమర్షియల్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మేజర్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. జూన్ 26న మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ వేడుక ఘనంగా జరగనుంది. చిత్రయూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు.

Chiranjeevi to grace Pakka Commercial Pre-release event

chiranjeevi
pakka commercial pre-release event
pakka commercial
gopichand
maruthi