Advertisementt

ఎందుకంటే మామ ఇది మన సినిమా

Wed 06th Jan 2021 12:59 PM
nede vidudala movie,endukante mama idi mana cinema song  ఎందుకంటే మామ ఇది మన సినిమా
Nede Vidudala Movie Endukante Mama idi Mana Cinema song ఎందుకంటే మామ ఇది మన సినిమా
Advertisement
Ads by CJ

ఐకా ఫిల్మ్ ఫాక్టరీ బ్యానర్ పై అసిఫ్ ఖాన్ మరియు మౌర్యాని హీరో హీరోయిన్స్ లుగా నటిస్తున్న సినిమా నేడే విడుదల. ఈ సినిమాను కొత్త దర్శకుడు రామ్ రెడ్డి పన్నాల డైరెక్ట్ చేస్తున్నారు. అయితే కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. ఎందుకంటే మామ ఇది మన సినిమా అనే హుక్ లైన్ ఆసాంతం, పాటను మళ్ళి మళ్ళి వినేలా వుంది. శ్రీమణి రచించిన ఈ సాంగ్ ని క్రేజీ అండ్ సెన్సేషనల్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మంచి ఈజ్ తో అద్భుతంగా పాడారు.   

ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉందని, మరో వారంలో ట్రైలర్ రిలీజ్ చేసి అతి త్వరలో మా సినిమాతో మీ ముందుకు వస్తాం అని తెలిపారు, అంతేకాక ఈ సినిమా మల్టిప్లెక్స్ అభిమాని నుండి నెల టిక్కెట్టు సాధారణ ప్రేక్షకుడి వరకూ ప్రతి ఒక్క సినిమా అభిమానికి తప్పకుండా నచ్చుతుంది, అటువంటి కథతో మా నేడే విడుదల సినిమాను తెరకెక్కించాం అని తెలిపారు.  

ఈ సినిమాలో మిగిలిన తారాగణంగా  కాశి విశ్వనాథ్, అప్పాజీ అంబరీషా, మాధవి, టి ఎన్ ఆర్, అదుర్స్ ఆనంద్, పీలా గంగాధర్, జబర్దస్ నవీన్ లు నటించిగా, ఈ సినిమాకు సంగీతం అజయ్ అరసాడ, లిరిక్స్ శ్రీమణి, కెమెరా సి హిచ్ మోహన్ చారి, ఎడిటింగ్ సాయి బాబు తలారి, ఫైట్స్ అంజి,  ఆర్ట్ డైరెక్టర్ సి హెచ్ రవి కుమార్, సిజి : ఆర్ అంకోజీ రావు, నిర్మాతలు నజురుల్లా ఖాన్, మస్తాన్ ఖాన్, రచన దర్శకత్వం రామ్ రెడ్డి పన్నాల. 

లహరి మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్ లో అందుబాటులో ఉన్న ఈ పాటను మీరు కూడా విని ఆనందించండి.

Nede Vidudala Movie Endukante Mama idi Mana Cinema song:

Nede Vidudala Movie Endukante Mama idi Mana Cinema song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ