అమ్మాయంటే అలుసా?
The film is coming out on the 16th Ammayante Alusaఈ నెల 16న రాబోతోన్న అమ్మాయంటే అలుసా? చిత్రం
కార్తీక్ రెడ్డి, నేనే శేఖర్, స్వాతి, శ్వేత, ఆయేషా హీరో హీరోయిన్లుగా నవులూరి భాస్కర్ రెడ్డి సమర్పణలో గీతశ్రీ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం అమ్మాయంటే అలుసా?. నేనే శేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని వై. బ్రహ్మ శేఖర్, వై. లిఖితా చౌదరి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఆడియోకి మంచి స్పందన వచ్చిందని తెలుపుతూ.. ఈ చిత్రాన్ని ఈ నెల 16న విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు నేనే శేఖర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను చాలా సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్‌గా వర్క్ చేశాను. ఆ అనుభవంతో నా పరిధిలో సినిమాను చాలా కష్టపడి తెరకెక్కించాం. నాకు నా టీమ్ అంతా ఎంతో సపోర్ట్ చేసింది. వారందరికీ ధన్యవాదాలు. సినిమా విషయానికి వస్తే.. ఆడవాళ్లను అలుసుగా చూడకూడదు. వారికి గౌరవం ఇవ్వాలనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమాను ఎలాగైతే ఎంజాయ్ చేశారో ఈ సినిమాలో సెకండాఫ్‌ను అలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే విడుదలైన పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఈ చిత్రంలో పొందుపరిచాము.. తప్పకుండా అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు.. అని తెలిపారు.
The film is coming out on the 16th Ammayante Alusa








































