టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (2-9-16)..!

3. 'చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే' ప్లాటినమ్ డిస్క్ వేడుక
పి.ఆర్. మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న సినిమా 'చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే'. పవన్, గట్టు మను హీరోలుగా నటించారు. సోనియా దీప్తి హీరోయిన్. షకలక శంకర్, తాగుబోతు రమేశ్, బాషా, షానీ, పింగ్ పాంగ్, చిట్టిబాబు, చంద్రమౌళి, శ్రీనివాస్ కీలక పాత్రధారులు. సోనీ పవన్, గట్టు రజిని నిర్మాతలు. సంతోష్ నేలంటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో శుక్రవారం జరిగింది. సాగర్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మల్కాపురం శివకుమార్, రామకృష్ణ గౌడ్, శివాజీరాజా, భోలే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ..టైటిల్ చాలా బావుంది. ట్రైలర్ కూడా నచ్చింది. హీరోలు చక్కగా చేశారు. సోనియా ఇప్పటికే నాలుగు హిట్లు ఇచ్చిన అమ్మాయి. తన గోల్డెన్ లెగ్ ఈ సినిమాకు ఉపయోగపడుతుంది. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదనే మాటలో వాస్తవం సగమే ఉంది. చిన్న సినిమాల కోసం నేను కూడా డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టాను. చిన్న చిత్రాల వల్ల చాలా మంది బతుకుతారు... అని అన్నారు. మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ...1970 నుంచి నల్గొండలో థియేటర్ ఉన్న కుటుంబం గట్టు కుటుంబం. ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుకను నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది. ట్రైలర్ చూస్తే సినిమాలో కొత్తదనం ఉందనిపిస్తోంది. కొత్తవారిని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది... అని చెప్పారు. సాగర్ మాట్లాడుతూ...రొటీన్ పిక్చర్‌లాగా లేదు. కాన్సెప్ట్ బావుంటే ఇప్పుడు అన్ని చిత్రాలూ ఆడుతున్నాయి. ఇది కూడా తప్పకుండా పెద్ద సినిమా అవుతుంది... అని అన్నారు. సోనియా మాట్లాడుతూ...ఇందులో మంచి పాట పాడాను. ఇకపై కూడా అవకాశం వస్తే తప్పకుండా పాడుతాను... అని చెప్పారు. శివాజీరాజా మాట్లాడుతూ...చిన్న చిత్రాలు లేకపోతే 24 క్రాఫ్ట్ లకు కష్టమవుతుంది. విడుదల సమయంలో ఎవరూ కంగారు పడొద్దు. తెలంగాణ ప్రభుత్వం కూడా చిన్న సినిమాలకోసం థియేటర్లను కేటాయిస్తోంది. హీరో కరెంట్ తీగలాగా సన్నగా ఉన్నాడు. పవర్ ఉన్న కుర్రాడు.. అని అన్నారు. ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ...సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. సోనియా పాడిన పాట బావుంది... అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ....ఫీల్ గుడ్ చిత్రమిది. యువతకు కావాల్సిన మసాలా కూడా ఉంటుంది. 2016లో విడుదలై విజయం సాధించిన చిత్రాల్లో మా సినిమా కూడా ఉంటుందనే నమ్మకం ఉంది... అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ...మా అబ్బాయికి ఈ సినిమాలో అవకాశం వచ్చింది. అతని కోసం నిర్మాతగా మారాను. 1973 నుంచి మాకు నల్గొండలో థియేటర్ ఉంది. అతిథులు అందరూ మాట్లాడిన మాటలు వింటుంటే దాదాపు 150 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తామనే నమ్మకం కుదిరింది... అని అన్నారు. హీరో మాట్లాడుతూ....మా పాటలకు మంచి స్పందన వచ్చింది. గత వారం రోజుల్లోనే మూడున్నర లక్షల క్లిక్కులు యూట్యూబ్‌లో పడ్డాయి... అని అన్నారు. సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ మాట్లాడుతూ....సినిమా బాగా వచ్చింది. సంగీతం చక్కగా కుదిరింది. పాటల కార్యక్రమం చేయడం ఆనందంగా ఉంది.. అని చెప్పారు.
4. పరుచూరి వెంకటేశ్వరరావు రిలీజ్ చేసిన .'ఆమె... అతడైతే.' ఫస్ట్‌లుక్
ఇంటర్నేషనల్ క్లాసికల్ డ్యాన్సర్ హనీష్ హీరోగా, కన్నడ భామ చిరాశ్రీ హీరోయిన్‌గా శ్రీ కనకదుర్గా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కె.సూర్యనారాయణ దర్శకత్వంలో ఎం.మారుతిప్రసాద్, ఎన్.రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఆమె.. అతడైతే'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని స్టార్ రైటర్ పరుచూరి వెంకటేశ్వరరావు విడుదల చేశారు.
ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ - 'ఆమె అతడైతే' టైటిల్ చాలా డిఫరెంట్‌గా వుంది. డైరెక్టర్ సూర్యనారాయణ చెప్పిన కాన్సెప్ట్ చాలా బాగుంది. పోస్టర్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్‌గా వున్నాయి. దర్శకుడు ఈ సినిమాను బాగా తెరకెక్కించాడని విన్నాను. టైటిల్ ఎంత క్యూరియాసిటీగా వుందో.. సినిమా కూడా అదేవిధంగా వుంటుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా సక్సెస్ అయ్యి నిర్మాతలకు మంచి లాభాలను తేవాలని కోరుకుంటూ దర్శకుడు సూర్యనారాయణకి మంచి బ్రేక్ అవ్వాలని కోరుకుంటున్నాను...అన్నారు.
దర్శకుడు కె.సూర్యనారాయణ మాట్లాడుతూ - తెలుగు మీడియంలో డిగ్రీ చదువుకున్న ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్ కుర్రాడు కలెక్టర్ కావాలని కలలు కన్న తన తండ్రి ఆశయాన్ని కొడుకు ఎలా నెరవేర్చాడనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాను. తన లక్ష్యం కోసం సిటీకి వచ్చిన ఆ కుర్రాడు, తను అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించాడు? అనే డిఫరెంట్ పాయింట్‌తో ఫుల్‌లెంగ్త్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. డిఫరెంట్ టైటిల్‌తో కథకి యాప్ట్ అయ్యేవిధంగా ఈ సినిమా వుంటుంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మా నిర్మాతలు మారుతీ ప్రసాద్, రాధాకృష్ణలు ఈ చిత్రాన్ని ఎంతో క్వాలిటీతో నిర్మించారు. క్లాసికల్ డ్యాన్సర్‌గా ఇంటర్నేషనల్ లెవల్‌లో గుర్తింపు పొందిన హనీష్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాం. హనీష్ ఫెంటాస్టిక్‌గా నటించాడు. కన్నడలో ఉపేంద్ర, సుదీప్ సరసన హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించిన చిరాశ్రీ మా చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. యశో కృష్ణ కథకి తగ్గట్లుగా మంచి మ్యూజిక్‌ని అందించాడు. సుద్దాల అశోక్‌తేజ ఎక్స్‌లెంట్‌గా పాటల్ని రాశారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ సూపర్. తప్పకుండా ఈ చిత్రం సక్సెస్ అయి దర్శకుడిగా నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను...అన్నారు.
నిర్మాతలు ఎం.మారుతీప్రసాద్, ఎన్.రాధాకృష్ణ మాట్లాడుతూ - ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌తో దర్శకుడు సూర్యనారాయణ ఈ చిత్రాన్ని రూపొందించాడు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం వుంటుంది. పరుచూరి వెంకటేశ్వరరావుగారు మా చిత్రం ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేయడం మాకు చాలా ఆనందంగా వుంది. యశోకృష్ణ సూపర్‌హిట్ ఆల్బమ్ ఇచ్చాడు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా సెప్టెంబర్ సెకండ్ వీక్‌లో ఆడియో రిలీజ్ చేసి అదే నెలాఖరులో చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం..అన్నారు.
5. హైదరాబాద్ రౌండ్ టేబుల్ 8 'షార్ట్ ఫిలిం కాంటెస్ట్'
హైదరాబాద్ రౌండ్ టేబుల్ 8 ఆధ్వర్యంలో షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డి.సురేష్ బాబు, జెమిని కిరణ్, రాజ్ కందుకూరి, సుబ్బారావు, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం చాలా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస అవసరాలు లేవు. దాని కారణంగా కార్పొరేటర్ స్కూల్స్ తో పోటీ పడలేకపోతున్నాయి. ప్రాజెక్ట్ 511 ద్వారా ఇలాంటి పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో 1022 స్కూల్స్ లో కనీస అవసరాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మిగిలిన స్కూల్స్ లో సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంస్థ నేతృత్వంలో మూడు నుండి పది నిమిషాల వ్యవథిలో షార్ట్ ఫిలింస్ కాంటెస్ట్ ను నిర్వహిస్తున్నారు. ఈ కాంటెస్ట్ కోసం డి.సురేష్‌బాబు, రామ్మోహన్ రావు, తరుణ్‌భాస్కర్, అవరసరాల శ్రీనివాస్‌లు జ్యూరీ సభ్యులుగా ఉంటారు. షార్ట్ ఫిలింస్‌ను p511shortfilm@gmail.com మెయిల్ కుపంపాలి. సెప్టెంబర్20 వరకు పంపాలి. అక్టోబర్ 9న ఈ షార్ట్ ఫిలింస్‌ను జె.ఆర్.సి.కన్వెన్షన్ సెంటర్‌లో ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరవుతారు. ఈ కాంటెస్ట్ కు ఏ ఫీజు లేదు, అలాగే భాషా బేదం లేదు. ఈ కాంటెస్ట్ మొదటి ప్రైజు విజేతకు 50వేల రూపాయలు,రెండవ ప్రైజుకు 15వేల రూపాయలు, మూడవ ప్రైజుగా 10వేల రూపాయలు అందిస్తారు.ఈ సందర్భంగా...డి.సురేష్ బాబు మాట్లాడుతూ - పాఠశాలల్లో కనీస అవసరాల కోసం ప్రాజెక్ట్ 511 చేస్తున్న చిన్న ప్రయత్నమిది. దీని ద్వారా పేద విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించవచ్చు. ఎవరైనా మంచి స్క్రిప్ట్‌తో ముందుకు వస్తే కెమెరాలను మా స్టూడియో ద్వారా అందించే ప్రయత్నం చేస్తాం... అన్నారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ - మంచి నాణ్యమైన విద్య కోసం చేసే ఈ ప్రయత్నం చాలా గొప్పది. మన ఇండస్ట్రీలోని చాలా మంది దర్శకులున్నారు. వారు కూడా ఈ కాంటెస్ట్ లో పాల్గొంటే బావుంటుంది.. అన్నారు. ప్రాజెక్ట్ 511దేశంలో చదువుకునే పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి స్థాపితమైన రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియాలో 600 స్కూల్స్ ను నిర్మించింది. అందులో 40 స్కూల్స్ ను హైదరాబాద్ లో నిర్మించింది. అందులో భాగంగా హైదరాబాద్ రౌండ్ టేబుల్ 8 సంస్థ 2000 సంవత్సరం కంటే ముందు నుండి దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ప్రాథమిక అవసరాలను అందించడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డిలలోని 1022 పాఠశాలల్లోని దాదాపు రెండు లక్షలకు పైగా విద్యార్థులకు తమ వంతు సహకారాన్ని అందించింది.
6. 'కుమారి 18+' మోషన్ పోస్టర్ విడుదల
వై.సుధాకర్ సమర్పణలో సెన్సేషనల్ హిట్ మూవీస్, ఫిల్మ్ విల్లా స్టూడియోస్ అసోసియేట్స్ పతాకాలపై శ్రీ సత్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కుమారి 18+'. మాల్యి మల్హోత్రా, యోధ, గోపీకృష్ణ, సాయికిరణ్, ఆదిత్యరామ్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను రాజ్‌కందుకూరి, మల్లిఖార్జున్‌రావులు విడుదల చేశారు. ఈ సందర్భంగా....హీరో ఆదిత్యరామ్ మాట్లాడుతూ - 'దర్శకుడు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. ఈ చిత్రంలో డాక్టర్ పాత్రలో కనపడతాను. హీరోయిన్ చక్కగా నటించింది. సహకారం అందించిన అందరికీ థాంక్స్' అన్నారు. సాయికిరణ్ మాట్లాడుతూ - 'ఈ సినిమాలో టైలర్ రోల్ చేశాను. డిఫరెంట్ ఏజ్‌లో ఉండే నలుగురు అబ్బాయిలు, అందంగా ఉండే అమ్మాయిని ప్రేమిస్తారు. దర్శకుడు శ్రీసత్య కారణంగానే సినిమా బాగా వచ్చింది. అందరికీ థాంక్స్' అన్నారు. మాల్యి మల్హోత్రా మాట్లాడుతూ -'ఆడిషన్‌లో నన్ను హీరోయిన్‌గా సెలక్ట్ చేశారు. ఈ సినిమాకు ముందు థియేటర్ ఆర్టిస్ట్‌గా వర్క్ చేశాను. ఒక మంచి పాత్రతో తెలుగు సినిమాకు పరిచయం కావడం ఆనందంగా ఉంది' అన్నారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ - 'యూత్‌కు నచ్చే టైటిల్. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను' అన్నారు. మల్లిఖార్జున్ మాట్లాడుతూ - 'దర్శకుడు శ్రీసత్య, నిర్మాతలు మంచి ప్లానింగ్‌తో సినిమా చేస్తున్నారు. క్యూట్ లవ్‌స్టోరీ' అన్నారు. డైరెక్టర్ శ్రీ సత్య మాట్లాడుతూ - 'సినిమా అంతా హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది. గేమ్‌లో ఎక్కువ మంది ఉంటేనే ఆసక్తి ఏర్పడుతుంది. అలాగే ఈ సినిమాలో ఓ అమ్మాయి కోసం ఒక డాక్టర్, ప్రొఫెసర్, ట్రైలర్, స్టూడెంట్ ఇలా నలుగురు మధ్య ఎలాంటి పోటీ నెలకొందనేదే కథ. షూటింగ్ అంతా పూర్తయ్యింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఈ నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అన్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ - సినిమా బాగా వచ్చింది. యూత్‌కు నచ్చే లవ్ ఎంటర్‌టైనర్. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్.. అన్నారు.
7. సెప్టెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతున్న 'మాయా మాల్'
'హోరా హోరీ' ఫేమ్ దిలీప్ హీరోగా గ్రీష్మ ఆర్ట్స్ సమర్పణలో వైష్ణవి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం 'మాయా మాల్'. ఇషా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో సోనియా, దీక్షాపంత్, పృథ్వీ, నాగినీడు తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. గోవింద్ లాలం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కె.వి.హరికృష్ణ, చందు ముప్పాళ్ల, నల్లం శ్రీనివాస్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా....చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ...లవ్ అండ్ హర్రర్ కామెడి థ్రిల్లర్‌గా రూపొందిన మా మాయా మాల్ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఓ మాల్‌లో ప్రధానాంశంగా సాగే సినిమా. అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. గతంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజుగారి బ్యానర్‌లో పనిచేసిన గోవింద్ లాలం కొత్త కథనంతో ఈ చిత్రాన్ని చక్కగా ఆసక్తికరంగా తెరకెక్కించారు. దిలీప్, ఇషా జంటగా నటించిన ఈ చిత్రంలో పృథ్వీ, షకలక శంకర్, తాగుబోతు రమేష్‌ల కామెడి చాలా హైలైట్‌గా నిలుస్తుంది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తీక్‌గారు అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతుంది. ఈ చిత్రానికి దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందింస్తుండగా, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. మంచి టీంతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఈ వినాయక చవితికి ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నాం. అలాగే సెప్టెంబర్ 8న టీజర్‌ను విడుదల చేస్తున్నాం. త్వరలోనే సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల చేసి ఈ సెప్టెంబర్ నెలలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం... అన్నారు.
8. 'బిచ్చగాడు' నిర్మాతల నుంచి మలయాళం బ్లాక్‌బస్టర్
ప్రచారంలో కొత్త ఒరవడి, అసాధారణమైన కంటెంట్ ఉంటే ఆ సినిమా హిట్టే. ఇటీవలి కాలంలో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన అనువాద చిత్రం 'బిచ్చగాడు' నేర్పిన పాఠమిది. ఓ అనువాద చిత్రం ఈ స్థాయి విజయం సాధించిందంటే నిర్మాతలు చేసిన అద్భుత ప్రచారమే అందుకు కారణం. ఓ స్ట్రెయిట్ సినిమాకి ధీటుగా ఈ సినిమాకి ప్రమోషన్ చేశారు నిర్మాతలు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై చదలవాడ పద్మావతి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. కేవలం కోటిన్నరతో తెరకెక్కి 25 కోట్లు పైగా వసూళ్లు సాధించిన రేర్ మూవీ ఇది. 50 థియేటర్ల నుంచి 200 థియేటర్లకు అంచెలంచెలుగా రేంజు పెంచుకుంటూ వెళ్లి బంపర్ హిట్ కొట్టిన చిత్రమిది. ఈ స్థాయి బ్లాక్‌బస్టర్‌ని తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత చదలవాడ పద్మావతి మరో అరుదైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. మలయాళంలో ఇటీవల రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన 'ఆన్ మరియ కలిప్పిలాను' చిత్రాన్ని తెలుగులో అందించనున్నారు. 'ఓకే బంగారం' ఫేం దుల్కార్ సల్మాన్ ఓ ముఖ్య అతిధిగా నటించగా.. 'నాన్న' (విక్రమ్ సినిమా) చిత్రంలో క్యూట్ అప్పియరెన్స్, చక్కని పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న బేబి సారా అర్జున్ ఈ చిత్రంలో టైటిల్ పాత్రలో నటించారు. మిథున్ మాన్యూల్ థామస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సన్ని వాయ్‌నే, అజు వర్గీస్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవలే రి







































