ప‌వ‌న్ కొత్త విల‌న్‌ని తీసుకొచ్చాడు..!

హీరోయిన్ విష‌యంలో ఎలా స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడో విల‌న్ విష‌యంలోనూ అలాగే స‌ర్‌ఫ్రైజ్ ఇచ్చాడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌. స్టార్ హీరోయిన్లు ఎంతోమంది ఉన్న‌ప్ప‌టికీ `గ‌బ్బ‌ర్‌సింగ్‌2` కోసం కొత్త అమ్మాయి అనీషా ఆంబ్రోస్‌ని ఎంపిక చేసుకొన్నాడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌. అలాగే విల‌న్‌లుగా న‌టించ‌డానికి ప్ర‌కాష్‌రాజ్ నుంచి జ‌గ‌ప‌తిబాబు వ‌ర‌కు బోలెడంత‌మంది న‌టులు ఉన్న‌ప్ప‌టికీ మ‌రాఠీ నుంచి శ‌ర‌ద్ కేల్క‌ర్ అనే కొత్త మొహాన్ని ఎంపిక చేశాడు. శ‌ర‌ద్ మ‌రాఠీ చిత్రం `లై బారీ`లో విల‌న్‌గా న‌టించాడు. అందులో శ‌ర‌ద్ న‌ట‌న‌ను చూసి ప‌వ‌న్ ముచ్చ‌ట‌ప‌డ్డాడ‌ట‌. వెంట‌నే ఆయ‌న‌తో సంప్ర‌దింపులు జ‌రిపి త‌న సినిమా కోసం ఎంపిక చేసుకొన్నాడు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌లాంటి అగ్ర క‌థానాయ‌కుడి నుంచి పిలుపొచ్చేస‌రికి శ‌ర‌ద్ ఆనందానికి అవ‌ధుల్లేవ‌ట‌. ఇప్పుడు తెలుగు నేర్చుకొని సినిమాలో సొంతంగా డైలాగులు చెప్పుకొనేందుకు శ‌ర‌ద్ ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ట‌. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో `గ‌బ్బ‌ర్‌సింగ్‌2` తెర‌కెక్కుతోంది. వ‌చ్చే నెల‌లో హైద‌రాబాద్‌లో కొత్త షెడ్యూల్ మొద‌లుపెడ‌తార‌ని స‌మాచారం. 
sarad kelkar
pavankalyan
gabbarsingh 2
sarath marar
sarad kelkar opposite to pavan kalyan sarad kelkar for gabbar singh 2