బాబా సెహ‌గ‌ల్ విల‌నిజం..!

తెలుగు తెర‌పైకి మ‌రో కొత్త విల‌న్ రాబోతున్నాడు. ఇప్ప‌టికే ఆ పోస్టుకు ఫుల్లు కాంపిటీష‌న్ ఏర్ప‌డింది. ఒక‌ప‌క్క ప్ర‌కాష్‌రాజ్‌, మ‌రోప‌క్క జ‌గ‌ప‌తిబాబు విల‌న్ క్యారెక్ట‌ర్ల‌కు  పోటీప‌డుతూ అవ‌కాశాల్ని సొంతం చేసుకొంటున్నారు. ఇప్పుడు ఆ ఇద్ద‌రికీ పోటీగా రాబోతున్నాడు బాబా సెహ‌గ‌ల్‌. 
గాయ‌కుడిగా అంద‌రికీ సుప‌రిచిత‌మైన బాబా సెహ‌గ‌ల్‌కి న‌ట‌న‌పైనా ఆసక్తి ఉంది. అందుకే `రుద్ర‌మ‌దేవి`లో ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. దాంతోపాటు నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా గౌత‌మ్‌మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రంలో బాబా సెహ‌గ‌ల్ విల‌న్‌గా న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం. 
గుండుతో క‌నిపించే బాబాలో విలన్‌ని పోలిన‌ట్టే ఉంటాడు. అందుకే గౌత‌మ్‌మీన‌న్ ఆయ‌న‌కి విల‌న్‌గా చాన్సిచ్చాడ‌ట‌. ఆ సినిమాలో బాబా పాత్ర క్లిక్ అయితే మాత్రం తెలుగు తెర‌కు మ‌రో కొత్త విల‌న్ దొరికిన‌ట్టే. దీంతో ఆ పోస్టుకు మ‌రింత కాంపిటీష‌న్ ఏర్ప‌డటం ఖాయం. 
baba sehgal
rudramadevi
nagachaitanya
goutham menen
baba sehgal as villian