మరోసారి మహేష్తో స‌మంత‌..!

చెన్నై చుల్‌బులి మ‌ళ్లీ ఛాన్స్ కొట్టింది. మహేష్‌తో క‌లిసి మూడోసారి న‌టించ‌బోతోంది. శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు కథానాయ‌కుడిగా `బ్ర‌హ్మోత్స‌వం` తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ముగ్గురు క‌థానాయిక‌ల‌కి చోటుంది. ప్ర‌ధాన‌క‌థానాయిక‌గా ఎవ‌రు న‌టిస్తార‌నే విష‌యంపై అంద‌రిలోనూ ఆస‌క్తి వ్య‌క్త‌మైంది. దాని గురించి చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ర‌క‌ర‌కాలుగా చ‌ర్చించుకొన్నారు. మొద‌ట ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌కి ఛాన్స్ ద‌క్కింన్నారు. తాజాగా ఆ అవ‌కాశాన్ని స‌మంత చేజిక్కించుకొన్న‌ట్టు స‌మాచారం. చిత్ర‌బృందం నిన్న‌నే స‌మంత పేరును క‌న్‌ఫ‌ర్మ్ చేసింద‌ట‌. రెండో క‌థానాయిక‌గా ప్ర‌ణీత న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. మూడో క‌థానాయిక ఎవ‌ర‌న్న‌ది ఇంకా తేల‌లేదు. రేపోమాపో ఆ పేరును కూడా ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం. స‌మంత చేతిలో ప్ర‌స్తుతం తెలుగు సినిమాలేవీ లేవు. ర‌కుల్ హ‌వాతో స‌మంత స్థానం గ‌ల్లంతైపోయింద‌ని మాట్లాడుకొన్నారు. కానీ ఇప్పుడు మ‌ళ్లీ కీల‌క‌మైన ప్రాజెక్టు స‌మంత చేతిలో ప‌డింది. ఇక నుంచి ఆమె దూకుడు మ‌ళ్లీ తెలుగులో మొద‌ల‌వుతుంద‌ని చెబుతున్నాయి ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు. 
samantha
brahmothsavam
maheshbabu
srikantha addala
samantha with maheshbabu again