'బస్తీ'గా వస్తున్న సీనియర్‌ హీరోయిన్‌ కుమారుడు..!!

టాలీవుడ్‌లో సహజనటిగా పేరుపొందిన జయసుధ తన తనయుణ్ని హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద సందడి లేకుండానే శరవేగంగా సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రంలో త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా టైటిల్‌ను 'బస్తీ'గా ఫైనలైజ్‌ చేశారు.

ఒకప్పటి అందాల తార.. ఇప్పటి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ జయసుధ తనయుడు శ్రేయాన్‌ కపూర్‌ త్వరలోనే హీరోగా 'బస్తీ'తో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమా ఆడియోను జూన్‌ 21న పెద్ద ఎత్తున నిర్వహించడానికి 'బస్తీ' యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. శిల్పకళావేదికలో విడుదలవనున్న ఈ ఆడియో ఫంక్షన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌ హాజరవనున్నట్లు సమాచారం. ప్రగతి చౌరస్య హీరోయిన్‌గా పరిచయమవుతున్న ఈ సినిమాకు వాసు మంతెన దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమాకు వాసు మంతెన నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం.

jayasudha
sreyan kapoor
bhasthi
audio release date