ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
యువదర్శకుడి మృతి..!!

ఓ యువ దర్శకుడు కన్నుమూశాడు. సినీ ఇండస్ట్రీలో తన మొదటిసినిమా కూడా విడుదల కాకముందే ఆ దర్శకుడు మృతిచెందాడు. ప్రస్తుతం జగపతిబాబు 'హితుడు' అనే సినిమాలో నటిస్తున్నాడు. వచ్చే నెల ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విప్లవ్ కోనేటి అనారోగ్యంతో బుధవారం మృతిచెందాడు. ఈ యువ దర్శకుడి వయసు కేవలం 33 సంవత్సరాలే. ఎంబీబీఎస్ చదివిన విప్లవ్ సినిమాలపై అభిరుచితో వైద్య వృత్తిని వదిలి సినిమాల్లోకి వచ్చాడు. అతడి మృతితో 'హితుడు' చిత్రం యూనిట్ పూర్తి విషాదంలో మునిగిపోయింది.
viplav konehuduti
director
died
hithudu







































