ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
మంచువిష్ణు మరో మూవీకి ఓకే చెప్పాడు..!!

ఒక సినిమా పూర్తికాకముందే మరో సినిమాకు పచ్చజెండా ఊపుతూ మంచువిష్ణు మంచి జోరుమీద ఉన్నాడు. ప్రస్తుతం దేవకట్టా దర్శకత్వంలో 'డైనమేట్' చిత్రంలో మంచువిష్ణు నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇంతలోనే ఆయన మరరో సినిమాకు కూడా అంగీకరించాడు. రవిబాబు వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన ముప్పరాజు హనుమన్ చెప్పిన స్టోరీ మంచువిష్ణుకు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడు. 'డైనమేట్' చిత్రం షూటింగ్ పూర్తవగానే ఈ సినిమాను ప్రారంభిస్తారని సమాచారం. ఆర్‌కే స్టూడియోస్ బ్యానర్‌పై రాజ్‌కుమార్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తారని సమాచారం. ఈ సినిమాలో ఓ అగ్రతారను నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌లో ఉన్న 'డైనమేట్' చిత్రాన్ని మే చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
manchu vishnu
upcoming films
dynamate
mupparaju hanumaan







































