ఇంటర్వ్యూ: బెల్లంకొండ సాయి శ్రీనివాస్

జనవరి 3 న తన పుట్టినరోజు జరుపుకోబోతున్న సందర్భంగా న్యూ ఇయర్ ని పురస్కరించుకుని మీడియా తో తన అనుభవాలను పంచుకున్నారు ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్.
విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా బదులిచ్చారు.
- సెకండ్ ఫిల్మ్ ఎలా ఉండబోతోంది?
అన్ని ఎలిమెంట్స్ కలగలిపి ఉండే సినిమా అది ఖచ్చితంగా ప్రేక్షకాదరణ పొందే సినిమా అవుతుంది.
- బోయపాటి వంటి టాప్ డైరెక్టర్ తో అవకాశం రావడం ఎలా అనిపిస్తోంది?
మొదటగా బోయపాటి వినిపించిన కథ నాకు సూట్ అవదు అనుకున్నాం ఆ తర్వాత ఆయన వేరే కథను సిద్ధం చేసి వినిపించారు. ఖచ్చితంగా అలాంటి పెద్ద దర్శకులతో పని చేయడం వల్ల చాలా విషయాలను నేర్చుకోవచ్చు. నాకు చాలా సంతోషంగా కూడా ఉంది.
- బోయపాటితో చేసే సినిమాకు నిర్మాత ఎవరు?
నాన్నగారే(బెల్లంకొండ సురేష్) ఈ సినిమాను కూడా నిర్మించబోతున్నారు.
- ప్రొడక్షన్ హౌస్ సమస్యలో ఉందని విన్నాం నిజమేనా?
అవును కాని నాన్నగారు చాలా తెలివైనవారు ఒక దగ్గర తగ్గినా మళ్లీ పైకి రావడానికే కష్టపడతారు.
- ఎవరైనా కెరీర్ ప్రారంభం లో లవర్ బాయ్ ఇమేజ్ కోరుకుంటారు కానీ మీరు మాస్ హీరోల క్యారక్టర్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం?
నా దగ్గరికి వచ్చే స్క్రిప్ట్స్ మాస్ హీరోల పాత్రలనే పోలి ఉంటున్నాయి కానీ భీమనేని గారితో చేయాలనుకునే సినిమా కాన్సెప్ట్ మాత్రం నేను చేసిన క్యారక్టర్స్ కి భిన్నంగా ఉంటుంది.
- భీమనేని తో చేసే సినిమా రీమేక్ ఫిల్మా?
తమిళ్ లో హిట్ అయిన 'సుందర్ పాండ్యన్' సినిమాను తెలుగు లో తీయాలనుకుంటున్నాం.
- ఈ సంవత్సరంలో ఎన్ని సినిమాలు చేయాలనుకుంటున్నారు?
2 సినిమాలు చేసే ప్లాన్ ఉంది.
- లాస్ట్ ఇయర్ పుట్టిన రోజుకు షూటింగ్ లో ఉన్నారా?
అల్లుడు శీను షూటింగ్ టైం లోనే పుట్టిన రోజు రావడం వల్ల జనవరి 1 కారణం తో 4 రోజులు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు.
- ఇండస్ట్రీలో స్నేహితులు ఎవరైనా ఉన్నారా?
చిన్నప్పటి నుండి అందరూ తెలుసు మంచి ఫ్రెండ్స్ అంటే వరుణ్ తేజ్, సాయి ధర్మ తేజ్, అఖిల్.
- భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు?
యాక్షన్ సినిమాలే చేయాలనుకుంటున్నా..!
అంటూ ముగించారు అల్లుడు శీను తో అరంగేట్రం చేసిన సాయి శ్రీనివాస్.







































