రివ్యూ: ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’
Anukunnadi Okkati Ayindi Okkati Movie reviewనటీనటులు: ధన్య బాలకృష్ణ, త్రిదా చౌదరి, కోమలి ప్రసాద్, సిద్ధి ఇద్నానీ, సమీర్ తదితరులు
మ్యూజిక్: వికాస్ బడిజా
సినిమాటోగ్రఫి: శేఖర్ గంగనమోని
ఎడిటింగ్: మణికాంత్
నిర్మాత: హిమ వెలగపూడి, వేగి శ్రీనివాస్
దర్శకుడు: బాలు అడుసుమిల్లి
జర్నలిస్ట్.. దర్శకుడిగా మారడం.. హీరో లేకుండా నలుగురు హీరోయిన్స్ తో సినిమా చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగించింది. బాలు అడుసుమిల్లి జర్నలిస్ట్ నుండి కొత్తగా దర్శకత్వంలోకి అడుగుపెట్టాడు. నలుగురు అమ్మాయిలుచుట్టూ జరిగే కథని అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి అంటూ సినిమాగా తెరకెక్కించాడు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ అనుకున్నది ఒక్కటి...అయినది ఒక్కటి సినిమా ప్రేక్షకులకు నచ్చిందా.. లేదా.. అనేది మన సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
ధన్య, సిద్ధి, త్రిదా, కోమలి ప్రసాద్ నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. నలుగురు పాశ్చాత్య పోకడలు కలిగిన క్లాసీ గర్ల్స్. అందులో సిధ్ధి మినహా మిగిలిన ముగ్గురు వేర్వేరు ఉద్యోగాలు చేసుకుంటూ ఒకే రూమ్‌లో ఉంటారు. ఈజీ లైఫ్‌కు అలవాటు పడి పార్టీలు పబ్బులు అంటూ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేసే ఈ నలుగురు స్నేహితులు ఓ ఫ్రెండ్ పెళ్లి కోసం గోవా వెళ్తారు. అందులో పెళ్లైన అమ్మాయి సిద్ధి. అయితే సిద్ది మాత్రం పెళ్లి చేసుకున్నా కూడా ఏదో ఒక అసంతృప్తితో ఉంటుంది. అయితే ఓ పెళ్లికని గోవా వెళ్లిన ఈ నలుగురు ఫ్రెండ్స్ అనుకోకుండా ఓ అబ్బాయి మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. అసలు పెళ్ళికి వెళ్లిన వాళ్ళు.. ఆ మర్డర్ ఎందుకు చేస్తారు? ఆ నలుగురు ఫ్రెండ్స్ నిజంగానే ఆ అబ్బాయిని మర్డర్ చేసారా? చేస్తే ఎలా తప్పించుకున్నారు? అనేది మిగతా కథ.
సమీక్ష:
హీరో లేకుండా కథను నడిపించడం కాస్త కష్టమే. అయినా.. కొత్త దర్శకుడు బాలు అడుసుమిల్లి తాను రాసుకున్న నలుగురు అమ్మాయిల నేపధ్యమున్న కథను కాస్త అడల్ట్ టచ్ ఇచ్చి మెరుగులు దిద్దుకున్నాడు. కథ నేటి సమాజంలో అమ్మాయిలు ఆధునిక పోకడలతో ఎలా చెలరేగిపోయి.. చివరికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటున్నారో అనే స్టోరీతో బాలు అడుసుమిల్లు మంచి కథనే రాసుకున్నాడు. టీజర్, ట్రైలర్‌లో చూపించినట్టుగానే ఇది కాస్త బోల్డ్ నెస్ ఉన్న కథ. తెలుగులో ఇలాంటి కథలు రావడం కొత్తేమి కాదు కానీ.. బాలు తీసుకున్న లైన్ ని కథగా నేరేట్ చెయ్యడంలో విఫలమయ్యాడని అనిపిస్తుంది. సినిమా ఫస్టాఫ్‌లో అక్కడక్కడా శృతి మించిన డైలాగులు కూడా ఉన్నాయి. అడల్ట్ కామెడీతో అక్కడక్కడా నవ్వులు పూయించాడు దర్శకుడు బాలు. గోవా వెళ్లిన తర్వాత ఓ అబ్బాయి కోసం అమ్మాయిలు మరీ అంతగా కొట్టుకోవడం.. నేను ముందు కాదు నేను ముందు అంటూ మీద పడిపోవడం అనేది కాస్త ఓవర్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో నలుగురు అమ్మాయిలు కలిసి అనుకోకుండా వచ్చిన అబ్బాయిని వాళ్లు చంపేయడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. అమ్మాయిలకు మరీ స్వేచ్ఛ ఎక్కువైతే ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. అయితే సినిమా మొత్తం మీద డబుల్ మీనింగ్ డైలాగులతో అక్కడక్కడా నవ్వులు పూయించిన అడల్ట్ కామెడీ అని చెప్పొచ్చు.
హీరోయిన్స్ నలుగురు.. ధన్య బాలకృష్ణ, కోమలీ ప్రసాద్, సిద్ది ఇద్నానీ, త్రిధా చౌదరి నటన మీద కన్నా గ్లామర్ మీద ఎక్కువ శ్రద్ద పెట్టడంతో.. అందరూ అందంగా కనిపించారు. కాకపోతే సినిమాలో ధన్య బాలకృష్ణ రోల్ కి కాస్త ఇంపార్టెన్స్ ఉంది.. మిగతావారంతా సాదా సీదాగా కనబడ్డారు. ఇక సాంకేతికంగా... వికాస్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ సో సో గానే అనిపిస్తాయి. అలాగే సినిమాటోగ్రాఫర్ గోవా అందాలు బాగానే చూపించాడు. ఇక సినిమాకి మెయిన్ మైనస్ ఎడిటింగ్. నిర్మాణ విలువలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఫైనల్‌గా అడల్ట్ కామెడీని ఇష్టపడేవారు నిరభ్యంతరంగా ఈ సినిమా చూడొచ్చు.
Anukunnadi Okkati Ayindi Okkati Movie Report








































