నిన్న అఖిల్-జైనాబ్, నేడు చైతు-శోభిత

అక్కినేని అభిమానులు లెనిన్ హిట్ తో అక్కినేని ప్రిన్స్ అఖిల్ కి హిట్ పడ్డాకా చాలా సంతోషంలో ఉన్నారు. లెనిన్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో అఖిల్ భార్య జైనాబ్ తో కలిసి ఫస్ట్ టైమ్ అభిమానుల ముందుకు రావడంతో ఫ్యాన్స్ పట్టరాని సంతోషంలో మునిగిపోయారు. అఖిల్, భార్య జైనాబ్ తో కలిసి కనిపించాడు.
ఇక ఈరోజు శనివారం అక్కినేని అభిమానులకు మరో ట్రీట్ దొరికింది. అది నాగ చైతన్య తన భార్య శోభిత తో కలిసి కనిపించాడు. భార్య భర్త లిద్దరూ ఓ షాప్ ఓపెనింగ్ లో కనిపించడం అభిమానులకు బాగా నచ్చేసింది. నాగ చైతన్య-శోభిత కలిసి హైదరాబాద్ లోని బోడుప్పల్ లో RS బ్రదర్స్ షాప్ ఓపెనింగ్ లో సందడి చేశారు.
ఆ కార్యక్రమంలో నాగ చైతన్య మట్లాడుతూ తమ్ముడు సినిమా లెనిన్ ని సూపర్ హిట్ చేసారు అంటూ అభినులకు థాంక్స్ చెప్పాడు. శోభిత బ్రింజాల్ పర్పుల్ పట్టు చీరలో చాలా చక్కగా సాంప్రదాయంగా కనిపించింది. భర్త చైతు తో కలిసి శోభిత కనిపించిన తీరు కి అభిమానులు ముగ్దులైపోతున్నారు.







































