పార్లమెంట్‌లోకి మరోసాని ఏపీ విభజన బిల్లు..!

ఆంధ్రప్రదేవ్‌ విభజన బిల్లును మరోసారి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టానున్నారా..? రెండు రాష్ట్రాలుగా విడవడి ప్రత్యేక ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నా.. బిల్లుకు సవరణలు తప్పవా..? ఈ బిల్లు మరోసారి పార్లమెంట్‌లో ఆమోదం పొందకపోతే తెలంగాణ, ఏపీలో మళ్లీ కలిసిపోతాయా..?.. ఈ డౌట్లన్నీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ స్టేట్‌మెంట్లతో వచ్చినవే. ఏపీ మేధావి ఉండవల్లి ఇప్పుడు మరో సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చాడు.

అదేంటంట.. ఏపీ విభజన బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందినా.. మరోసారి ఆ బిల్లును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉండన్నారు. ఆ బిల్లుపై జరిగిన చర్చలో పలు సవరణలను సభ్యులు సూచించారని, వీటిపై ఎంపీల ఆమోదం తెలపకుండానే బిల్లు పార్లమెంట్‌లో పాసైనట్లు ప్రకటించారని ఆయన వాదిస్తున్నారు. ఈ లెక్క ప్రకారం మరోసారి విభజన బిల్లు సవరణలపై పార్లమెంట్‌లో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకుండా విభజనకు వెంకయ్యనాయుడు కారణమని, ప్రత్యేక హోదాపై సినిమా చూపించి అధికారంలోకి రాగానే ఆ విషయాన్ని పక్కన పెట్టేశారని ఆయన విమర్శించారు. ఇక వెంకయ్యనాయుడు సంగతిని పక్కనపెడితే విభజన బిల్లును రూపొందించడం కానుంచి మొదలుపెడితే.. పార్లమెంట్‌లో ఆమోదం పొందే వరకు కూడా ఉండవల్లి మరి కాంగ్రెస్‌లోనే కొనసాగాడు. మరి విభజన పాపంలో ఉండవల్లికి భాగం లేదా అనే అనుమానాలు తలెత్తమానవు. మరి మేధావైన ఉండవల్లికి ఇలాంటి అనుమానాలు రావేమో.

undavalli arunkumar
ap bifurication bill
parliment
venkaiah naidu