ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Konda Surekha withdraws remarks against KTR

బీఆర్ఎస్ ని దువ్వుతున్న కొండా సురేఖ

Konda Surekha withdraws remarks against KTRKonda Surekha withdraws remarks against KTR

 

తెలంగాణాలోని కొండా ఫ్యామిలీకి కండువాలు మార్చడం కొత్తేమి కాదు. కాంగ్రెస్ నుంచి టీఆరెస్ లోకి, తర్వాత బీఆర్ఎస్ ఓడిపోగానే కాంగ్రెస్ లోకి రావడమే కాదు.. మినిస్టర్ గా పదవిని పొందడమే కాకుండా.. అప్పుడప్పుడు రెబల్స్ లా మారిపొతూ పార్టీలకు తలనొప్పులు తెచ్చిపెడతాయి. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ.. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మారడం, పార్టీ నుంచి గెంటివేయించుకోవడం అన్నీ ఈమధ్య కాలంలో జరిగినవే.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రి అయిన కొండా సురేఖ కేటీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టె ఉద్దేశ్యంతో చేసిన సినీ సెలబ్రిటీస్ తో కేటీఆర్ అనుబంధం గురించిన వ్యాఖ్యలు కాంట్రవర్సీ అవడమే కాదు ఈకేసు కోర్టుకు కూడా వెళ్ళింది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి గెంటివేయించుకుని మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్టుగా ఉంది కొండా ఫ్యామిలీ.

ఈరోజు సోషల్ మీడియా వేదికగా.. 
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిపై గతంలో నేను చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను.
అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు.
ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసింది. కేటీఆర్ గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం గాని నాకు ఎంతమాత్రం లేవు. నా వ్యాఖ్యలు వారిని గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను.. అంటూ ట్వీట్ చేసారు.

మరి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కొండా దంపతులు కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జరిగినా.. ప్రస్తుతం కొండా ఫ్యామిలీ మాత్రం బీఆర్ఎస్ ను దువ్వుతూ మళ్ళీ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారనిపించకమానదు. 

Konda Surekha Expresses Regret Over Past Remarks on KTR