విశ్వక్ సేన్ ఓపెన్ కామెంట్స్
Vishwak Sen's open comments on Cult
విశ్వక్ సేన్ హీరో మరియు దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం కల్ట్. ఈ చిత్రం మొదటి నుంచి యాక్షన్ మూవీ గానే ప్రొజెక్ట్ అయ్యింది. కల్ట్ ప్రమోషన్స్ లోను ఆసక్తికర విషయాలను రివీల్ చేస్తున్న విశ్వక్ సేన్.. కల్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అవాయిడ్ చేసి ప్రీ రిలీజ్ ట్రైలర్ ని లాంచ్ చేసారు.
అర్నబ్ తుఫాన్ కారణంగానే కల్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేసినట్లుగా చెప్పిన టీం రిలీజ్ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేసింది. అయితే ఈ ఈవెంట్ లో విశ్వక్ సేన్ మట్లాడుతూ.. కల్ట్ సినిమాని చూడాలి అనుకుంటే.. వీక్ హార్ట్ ఉన్నవాళ్లు, ఇంకా పిల్లలు మా సినిమాకి దూరంగా ఉండండి అంటూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
కల్ట్ చిత్రానికి దాదాపుగా సెన్సార్ బోర్డు చాలా కట్స్ ఇచ్చారు, చాలా చోట్ల మ్యూట్ కూడా చేశారట. మరి దీన్ని బట్టి యాక్షన్ మోతాదు, అలాగే బూతులు ఎన్ని ఉన్నాయో అర్ధమవుతుంది. అదేమీ దాచుకోకుండా, సెన్సార్ బోర్డు ని తిట్టకుండా విశ్వక్ సేన్ కల్ట్ సినిమాకి వీక్ హార్ట్ ఉన్నోళ్లు, కిడ్స్ ని దూరంగా ఉండమని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.
















































