Advertisementt

మహిళల భద్రతకు పెనుముప్పు

Sat 11th May 2024 01:48 PM
weapp  మహిళల భద్రతకు పెనుముప్పు
WeAPP మహిళల భద్రతకు పెనుముప్పు
Advertisement
Ads by CJ

ఊరందరికీ నీతులు చెప్పే తెలుగుదేశం ఇప్పుడు అనైతిక చర్యలకు పాల్పడుతోంది అని వైసీపీ ఆరోపిస్తుంది. గ్రామాల్లో.. పట్టణాల్లో వాలంటీర్లు మహిళలకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారని... ఈ సమాచారం కిడ్నాపర్ల చేరుతోందని...దీంతో వాళ్లొచ్చి ఒంటరి మహిళలు... ఏ ఆదరవులేని యువతులను కిడ్నప్ చేస్తున్నారని గతంలో చంద్రబాబు, ఆయన రాజకీయ భాగస్వామి పవన్ కళ్యాణ్ సైతం వేదికల మీద కేకలు పెట్టారు. తీరా ఇప్పుడు ఎన్నికల సమయంలో తెలుగుదేశం రాష్ట్రంలోని మొత్తం మహిళలు, వారి వయసు..ఊరు...అడ్రస్...ఆధార్ వంటి వివరాలు సేకరిస్తున్నారు. 

వాస్తవానికి గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సాధికార సర్వే పేరుతో ప్రజల సమాచారాన్ని సేకరించి, అప్పట్లోనే డేటా చౌర్యానికి పాల్పడి టీడీపీ సేవా మిత్ర యాప్‌లో పొందుపరిచిన విషయం తెలిసిందే. దాన్ని మరింత ఆధునీకరించి ఇప్పుడు వుయ్‌ యాప్‌  తెచ్చారు. ఇందులో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఓటర్ల పేర్లు, చిరునామాలు, ఆధార్, ఫోన్‌ నంబర్లు, ఓటరు ఐడీ నంబర్లు, వృత్తి తదితర వ్యక్తిగత వివరాలన్నీ పొందుపరిచారు. వారు ఏ పార్టీ సానుభూతిపరులో కూడా ఇందులో ఉంది. ఇది ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కుకు పూర్తి విరుద్ధం. ప్రతి మహిళా వివరాలూ తమదగ్గర దాచిపెట్టుకుని వారి వ్యక్తిగత స్వేచ్ఛను సైతం  హరించేందుకు కుట్ర పన్నుతున్నారు. ఇది పూర్తిగా అనైతికం .. అంటూ వైసీపీ ప్రజలకి వివరించే ప్రయత్నం చేస్తుంది. 

# అధికారంలో ఉండగా ప్రజా సాధికార సర్వే పేరుతో డేటా చౌర్యం

# ఇప్పుడు వుయ్‌ యాప్‌లో ఓటర్ల సమగ్ర సమాచారం.. ఓటర్ల స్లిప్పులతో ప్రత్యేక బార్‌కోడ్‌ ఉన్న కరపత్రాల పంపిణీ

# బార్‌కోడ్‌ స్కాన్‌ చేయగానే హైదరాబాద్‌ నుంచి డిజిటల్‌ చెల్లింపులు.. ఓటరుకు రూ.5 వేలు చెల్లిస్తున్నారు 

# బూత్‌ కమిటీల ద్వారా ఇంటింటా స్లిప్పుల పంపిణీ.. దీని పర్యవేక్షణ, బార్‌కోడ్‌ స్కాన్‌కు మరో బృందం

మొత్తం పర్యవేక్షణకు హైదరాబాద్‌లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌.. నియోజకవర్గానికి రూ.87.50 కోట్ల చొప్పున డిజిటల్‌ చెల్లింపులు

# ఈ డిజిటల్ చెల్లింపులకు ప్రజల పూర్తి వివరాలు సేకరిస్తున్న తెలుగుదేశం... ఇది దుర్వినియోగమైతే వారి భద్రతకు పెను ముప్పు అని ప్రజల్లో ఆందోళన నెలకొన్నట్లుగా వైసీపీ నేతలు టీడీపీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

WeAPP:

We APP

Tags:   WEAPP
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ