బహిరంగ సభలకి సిద్ధమంటున్న జగన్

Jagan

సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర చేపట్టి ప్రతి నియోజకవర్గ ప్రజలని కలుస్తూ వారి యొక్క సమస్యలని తెలుసుకుంటున్న జగన్ కి ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. జగన్ సిద్ధం సభలకి మించి ఆయన చేపట్టిన బస్సు యాత్రకి తరలి రావడంతో వైసీపీ కి మరోసారి ప్రజలు అధికారం ఇవ్వబోతున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయంటూ అందరూ అంచనా వేస్తున్నారు. 

ప్రస్తుతం జగన్ మేమంతా సిద్ధం కి వస్తున్న స్పందనతో మరింత ఈ నెల 28 నుంచి భారీ బహిరంగ సభలకు సిద్ధమవుతున్నారు. ప్రతి రోజు మూడు నియోజక వర్గాల్లో జగన్ బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. సిద్ధం సభలు, మనమంతా సిద్దమే బస్సు యాత్రకి మించి వైసీపీ అదే జగన్ బహిరంగ సభలకు ప్రజలు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. 

ఏపిలొ కూటమి బలహీనతలు ఎత్త చూపుతూ గత ఐదేళ్లుగా తాము ప్రజలకి ఏం చేసామో చేబుతూ ఈ బహిరంగ సభల్లో జగన్ ప్రసంగం ఉండబోతుంది. వచ్చే ఐదేళ్లలో ,మళ్లీ అధికారం చేపడితే ప్రజలకి చెయ్యబోయే మంచి పనులని వివరించబోతున్నారు. 28 ఉదయం 10 గంటలకి తాడిపత్రిలో బహిరంగ సభ నిర్వహించి ఆ తర్వాత 12,30 కి వేంకటగిరి, 3 గంటలకు కందుకూరులో జగన్ బహిరంగ సభలు ఉండబోతున్నాయి. 

ఆ తర్వాత రోజు అంటే 29 న ఉదయం పదిగంటలకు చోడవరం, 12.30 నిమిషాలకి పి. గన్నవరం, 3 గంటలకి పొన్నూరు లో జగన్ బహిరంగ సభలు ఉండబోతున్నాయి. 30 న పది గంటలకి కొండపి, 12.30 నిమిషాలకి మైదుకూరు, 3 గంటలకి పీలేరులో జగన్ బహిరంగ సభలకు హాజరవుతారు. మే 1 ఉదయం 10గంటలకి బొబ్బలి, 12.30 పాయకురావు పేట, 3 గంటలకి జగన్ ఏలూరులో బహిరంగ సభలని నిర్వహస్తారు 

Jagan

jagan