సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సిద్ధం
Siddhamరాప్తాడులో జరిగే సిద్ధం కార్యక్రమానికి సంబంధించిన అప్‌డేట్స్‌తో సోషల్ మీడియా షేక్ అవుతోంది. సీఎం వైయస్ జగన్ ఆధ్వర్యంలో సిద్ధం-3 కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఈ సభకు రాయలసీమ జిల్లాల నుంచి భారీస్థాయిలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు.
కార్యక్రమానికి వచ్చిన వారు ఆ ప్రాంతాన్ని ఫోటోలు తీసి, అప్‌లోడ్ చేయడంతో ట్విట్టర్, ఫేస్‌బుక్‌లు సిద్ధం సభ ఫోటోలతో నిండిపోయాయి.
మరోవైపు ట్విట్టర్‌లో సిద్ధం హ్యాష్‌ట్యాగ్ దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది.
కార్యక్రమానికి సీఎం వైయస్ జగన్ హాజరుకాకముందే సిద్ధం అప్‌డేట్స్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపాయి. జగనన్న రంగంలోకి దిగితే గ్రౌండ్‌లోనే కాదు సోషల్ మీడియాలో కూడా షేక్ చేయగలమని ఒక అభిమాని అనగా ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్ జగనన్న ఇస్ రోరింగ్‌లైన్ అని మరో అభిమాని అన్నాడు.
Jagan







































