కక్షకాదు... చేసిన తప్పుకు శిక్ష

Chandrababu Naidu Arrested

బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసారు. కంపెనీలు.. పరిశ్రమలు వ్యాపార, వాణిజ్య సంస్థలు ఆంధ్రాకు క్యూ కడతాయి. అందరూ తమ గ్రామాలు పట్టణాలకు సమీపంలోనే ఉద్యోగాలు చేసుకోవచ్చు... దీనికోసం మీకు స్కిల్స్ లేకపోయినా ఫర్లేదు.. మీకు ఆ శిక్షణ కూడా ప్రభుత్వమే నేర్పిస్తుంది నమ్మండి.. బాబును గెలిపించండి అంటూ ఎలక్షన్స్ లో టీడీపీ ప్రచారం చేసింది. తమ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి.. తమ జీవితాలు మెరుగుపడుతుందని ఆశపడ్డారు. ఇంటిల్లిపాదీ 2014లో చంద్రబాబుకు ఓటేసి  గెలిపించారు. ఎన్నికల్లో గెలిచాక ప్రజలను మరిచిపోయింది టీడీపీ పాలకులు తమ సొంత లాభం చూసుకున్నారు. రాష్ట్రంలోని మిగతా యూత్ కూడా తమకూ చిన్నవో పెద్దవో ఉద్యోగాలు వస్తాయని ఆశించారు. ఉద్యోగాలు వస్తాయంటూ యువత అలాగే కళ్ళలో వత్తులు వేసుకుని ఉన్నారు. మీ నమ్మకమే మా పెట్టుబడి అన్నట్లు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పేరిట వందలకోట్లు మింగేశారు. రూ. మొత్తం 371 కోట్లను ఆ పథకానికి విడుదల చేసి డమ్మీ కంపెనీల పేరిట రూ. 241 కోట్లు మళ్ళీ చంద్రబాబు అకౌంట్ లో జమ అయ్యాయంటూ వైసీపీ నేతలు ఆరోపించడం కాదు.. ప్రస్తుతం ఆ కేసులో చంద్రబాబుని సిఐడి అరెస్ట్ చేసింది. 

ఏ పథకం చూసినా వందలకోట్ల అవినీతి. ఇదుగో మీ పేరిట ఇంత మోసం జరిగింది. ఇలాంటి పథకాల పేరిట దోచుకున్నది వేలకోట్లలో ఉంది. ఇది చిన్న శాంపిల్ అంటూ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాన్ని ప్రజల ముందు పెట్టింది ఏపీ ప్రభుత్వం. పూర్తి ఆధారాలను న్యాయస్థానం ముందు పెట్టి ధర్మాధర్మాలను మీరే నిర్ణయించండి అని ప్రభుత్వం న్యాయవాది వాదించారు. ఎక్కడా తప్పించుకునేందుకు వీలు లేదు.. చంద్రబాబు కి శిక్ష పడేవరకు నిద్రపోయేది లేదు అంటూ సీఎం జగన్ నడుం బిగించారు.. అని వైసీపీ నేతలు అంటున్నారు.  

ప్రభుత్వం కక్షగట్టి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపింది అంటూ కొందరు టీడీపీ నేతలు అంట్లడుతున్నారు కానీ..   కానీ అది రాజకీయ కక్ష కాదు.. తన అధికార సమయంలో చేసిన తప్పులకు శిక్ష అని ప్రభుత్వంతోబాటు న్యాయవ్యవస్థ చెబుతోంది.. అంటూ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. రాజకీయపరమైన వైరాలు ఉన్నంతమాత్రాన కోర్టులకు ఎందుకు కక్ష ఉంటుంది. రాజకీయ కక్షలకు కోర్టులు ఎందుకు వేదికలుగా మారతాయి. కేసుల్లో స్పష్టమైన ఆధారాలను , పత్రాలనూ  తమముందు సమర్పించిన తరుణంలో కోర్టు వాటిని సంపూర్ణంగా పరిశీలించి ఎక్కడ ఏయే స్థాయిల్లో అవినీతి జరిగిందో స్పష్టతకు వచ్చాక తీర్పు చెప్పింది. ఇది పేదల విజయం.. తమను మోసం చేసిన పెత్తందారులను ఓడించేందుకు పేదల పక్షాన పోరాడుతూ సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం సాధించిన విజయం.. అంటూ వైసీపీ మంత్రులు, నేతలు పండగ చేసుకుంటున్నారు. 

Chandrababu Naidu, Arrested In Alleged Corruption Case

chandrababu naidu