ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> A project that Mamitha Baiju missed out on!

మమిత బైజు మిస్సయిన ప్రాజెక్ట్!

A project that Mamitha Baiju missed out on!A project that Mamitha Baiju missed out on!

మలయాళ నటి మమిత బైజు `ప్రేమ‌లు` సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఎదగకముందే ప్రసిద్ధ దర్శకుడు కమల్ తెరకెక్కించాలనుకున్న ప్రాజెక్ట్‌లో అమ్మ‌డిని ఎంపిక చేయాలని భావించారు. మమిత నటించిన `ఖో ఖో` చిత్రంలో అమ్మ‌డి నటన చూసి ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడు కమల్ తదుపరి చిత్రంలో హీరోయిన్‌గా తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. అలాగే మ‌మిత భవిష్యత్తులో గొప్ప నటిగా ఎదుగుతుందని  బలంగా న‌మ్మారు.

కమల్.. మమిత బైజును కథానాయికగా తీసుకోవాలని భావించినా? ఆ సినిమాలోని ప్రధాన నటుడు.. నిర్మాత అందుకు అంగీకరించలేదు. చిత్రంలో నూతన నటి కంటే ఎక్కువ పరిచయమున్న ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ అయితే బాగుంటుందని  భావించారు. ఆ పాత్రకు మమిత పూర్తి న్యాయం చేయగలదని దర్శకుడు ఎంతగానో నచ్చజెప్పడానికి ప్రయత్నించినా? హీరో, నిర్మాతలు పట్టు వీడకపోవడంతో ఆ సమయంలో ఆ ప్రాజెక్ట్ నుండి తప్పించాల్సి వచ్చింది.

ఆ తర్వాత అనూహ్యంగా విడుదలైన `ప్రేమ‌లు` చిత్రం మమిత బైజు కెరీర్ గ్రాఫ్‌ను పూర్తిగా మార్చేసింది. సౌత్ ఇండియా లో అప్పట్లో ఊహించని పాపులారిటీని సొంతం చేసుకుని స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో గతంలో ఆమెను కొత్త నటిగా భావించి తిరస్కరించిన  నిర్మాత ఇప్పుడు మమితను కాదనుకున్నందుకు తప్పకుండా పశ్చాత్తాపపడుతూ ఉంటారని దర్శకుడు కమల్ అభిప్రాయపడ్డారు.
 

Mamitha Baiju