కుమార్తె రాకపై నటుడి భావోద్వేగం!
Sangeeth Pratap Blessed with Baby Girlమలయాళ నటుడు సంగీత్ ప్రతాప్- ఆయన భార్య ఆన్సీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. ఈ విషయాన్ని దంపతులు వినూత్నంగా ఓ ప్రత్యేక వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు. `సీన్ వన్ - అవర్ లిటిల్ వన్ ఆన్ ది వే` అనే సినిమా శైలిలో రూపొందించిన ఈ ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది.
తాము తల్లిదండ్రులు కాబోతున్నామనే విషయాన్ని అలాగే చిన్నారి రాకను తెలియజేసేందుకు ఈ క్యూట్ కపుల్ ప్రియదర్శన్ సినిమా చూస్తున్నట్లుగా ఓ విజువల్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు. ఈ సృజనాత్మక ప్రకటన ద్వారా తమ జీవితంలోకి కొత్త అతిథి రాకను ఎంతో ఆనందంగా ప్రకటించారు. ఈ వార్త తెలిసిన ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా జంటకు అభినందనలు తెలిపారు. నటులు నస్లెన్, మాథ్యూ థామస్ తదితరులు శుభాకాంక్షలను తెలియజేశారు.
కుమార్తె జననం గురించి చెబుతూ సంగీత్ ప్రతాప్ ఓ ఎమోషనల్ నోట్‌ను పంచుకున్నారు. `కుంజే.. నీ తల్లి చిన్న చిన్న విషయాలకు కూడా ఎంతో భయపడేది. ఒక చిన్న సూదిని చూసి కూడా కన్నీళ్లు పెట్టుకునేది. కానీ నిన్ను ఈ లోకానికి తీసుకురావడానికి రాత్రి నా ఎంపికలను నేనే ప్రశ్నించుకున్నాను. నిన్ను చేతుల్లోకి తీసుకున్న ఆ క్షణంలో నా కళ్ల నుంచి నీళ్లొచ్చాయి. నువ్వు రాత్రి జన్మించావని అంటారు. కానీ నిజం చెప్పాలంటే నువ్వు మొదటి శ్వాస తీసుకున్న క్షణంలో మళ్లీ పుట్టాను` అంటూ భావోద్వేగాలను అక్షర రూపంలో పంచుకున్నారు.
















































