షాకింగ్: బిగ్ బాస్ - రోహిత్ ఎలిమినేటెడ్
Bigg Boss Telugu 10: Rohit Eliminated
బిగ్ బాస్ సీజన్ 10 లోకి అగ్నిపరీక్ష ప్లాట్ ఫామ్ నుంచి పవర్ ఫుల్ గా అడుగుపెట్టిన రోహిత్ నాయుడు మొదటి రెండు వారాల పాటు టాస్క్ పెరఫార్మెన్సు లో 100 శాతం ఇచ్చాడు. ఆ రెండు వారాల్లో త్రిగుణ తో గొడవలు, షాలిని ఫ్రెండ్ షిప్ అన్ని అతని ఆటను కిల్ చేసాయి. పోట్లాటలు, గొడవలు, షాలిని తో టైమ్ స్పెండ్ చెయ్యడం తప్ప రోహిత్ మళ్లీ ఆట ఆడలేదు.
షాలిని ఎలిమినేట్ అయ్యి సీక్రెట్ రూమ్ కి వెళ్లొచ్చి అదే వారం హౌస్ ఓటింగ్ తో ఎలిమినేట్ అయ్యింది. ఇక ఈ వారం హౌస్ ఓటింగ్ లో రెడ్ అండ్ డేంజర్ జోన్ లో ఉన్న రోహిత్ కి మూడు ఓట్లు పడ్డాయి. మరోపక్క బయట రోహిత్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓటింగ్ లో ఎపుడు నెంబర్ 1 పొజిషన్ లోనే ఉన్నాడు.
కానీ హౌస్ లో మాత్రం రోహిత్ కి సపోర్ట్ లేదు. షాలిని షాలిని అంటూ తిరిగి మిగతా వారితో గొడవలు పెట్టుకున్నాడు. ముఖ్యంగా త్రిగుణ బ్యాచ్ తో గొడవలు, ముఖేష్ బ్యాచ్ తో గొడవలు. షాలిని వెళ్ళిపోయాక ముఖేష్ బ్యాచ్ తో ఫ్రెండ్ షిప్ స్టార్ట్ చేసాడు. వైల్డ్ కార్డు లు చెప్పినా ఆట మార్చుకోలేదు, హోస్ట్ వార్నింగ్ లు లెక్క చెయ్యలేదు, బిగ్ బాస్ వార్ణింగ్స్ లైట్ తీసుకున్నాడు.
త్రిగుణ ని తొక్కేస్తా, పొడిచేస్తా అంటాడు తప్ప టాస్క్ ఆడడు. రోహిత్ ఎలా ఉన్నా అతన్ని బయట సపోర్ట్ చేసే వారి సంఖ్య ఎక్కువైంది. కాని అనూహ్యంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో రోహిత్ హౌస్ ఓటింగ్ తో ఎలిమినేట్ అవడం అందరికి షాకిచ్చింది. నిన్న శనివారం ఎపిసోడ్ లో జాన్సీ ఆడియన్స్ ఓటింగ్ తో ఎలిమినేట్ అవ్వగా.. ఈరోజు ఆదివారం హౌస్ ఓటింగ్ తో రోహిత్ వెళ్ళిపోయాడు.
దానితో రోహిత్ ఫ్యాన్స్ ఇది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ గోల గోల చేస్తున్నారు. బిగ్ బాస్ చరిత్రలోనే ఇది దారుణం అంటూ వాళ్ళు పోస్ట్ లు పెడుతున్నారు. మరోపక్క అతను ఎలిమినేట్ అవడమే బెటర్ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
















































