గుంటూరు, ఆదర్శం.. రెండూ రెండే!

Adarsha Kutumbam Public TalkAdarsha Kutumbam Public Talk


అలా వైకుంఠపురంలో చిత్రం తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ స్టార్ మహేష్ తో గుంటూరు కారం సినిమా చేసారు. ఆ చిత్రంపై చాలానే విమర్శలొచ్చాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ డైలాగ్స్ పై. మహేష్ కి ఇలాంటి సినిమా ఇచ్చారేమిటి అని మహేష్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ పై చాలా గుర్రుగా ఉన్నారు.

ఇప్పుడు వెంకటేష్ తో త్రివిక్రమ్ తెరకెక్కించిన ఆదర్శ కుటుంబం చిత్రం గత శుక్రవారమే విడుదలైంది. ఆదర్శ కుటుంబానికి జస్ట్ యావరేజ్ టాక్ వచ్చింది. ఈ సినిమాని రవితేజ ఖిలాడీ, అర్జున్ బ్లాస్ట్ చిత్రాలను రిఫరెన్స్ గా తీసుకున్నారు. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కానరాలేదు అంటూ చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

గుంటూరు కారం, ఆదర్శ కుటుంబం రెండూ రెండే.. అలాంటి త్రివిక్రమ్ తర్వాత పురాణాల నేపథ్యంలో గాడ్ ఆఫ్ వార్ అనౌన్స్ చేసారు. ఎన్టీఆర్ తో చెయ్యబోయే మూవీ ని త్రివిక్రమ్ హ్యాండిల్ చేయగలరా అనే అనుమానాలు నెటిజెన్స్ వ్యక్తం చెయ్యడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో గుబులు పుట్టిస్తుంది. 

Adarsha Kutumbam