స్టార్ హీరో విజయ్ కుమారుడి హీరో ఎంట్రీ
Jason Sanjay Hero entryచాలామంది స్టార్ హీరోల పిల్లలు నేరుగా నటనతోనే తెరంగేట్రం చేస్తుంటారు. కానీ తలపతి విజయ్ కుమారుడు జెసన్ సంజయ్ మాత్రం భిన్నంగా దర్శకత్వం వైపు అడుగులు వేసిన సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా `సిగ్మా` అనే స్టైలిష్ యాక్షన్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని సాధించలేకపోయింది.
దర్శకత్వంపై దృష్టి పెట్టిన జెసన్ సంజయ్ తాజాగా నటుడిగా మారాలని నిర్ణయించుకున్నారట్లు సమాచారం.. ప్రస్తుతం సంజయ్ పలు కథలను వింటూ నటనపై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం `డ్యూడ్` చిత్ర దర్శకుడు కీర్తీశ్వరన్ దర్శకత్వంలో జెసన్ సంజయ్ తొలి చిత్రంలో హీరోగా నటించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
తమిళ సినీ వర్గాల ప్రకారం జెసన్ సంజయ్ హీరోగా పరిచయమయ్యే ఈ భారీ ప్రాజెక్ట్‌ను స్టార్ డైరెక్టర్ అట్లీ నిర్మించ నున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. అలాగే కీర్తీశ్వరన్ త్వరలోనే శింబుతో కూడా ఓ సినిమాకు కమిట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ముందుగా ఏ హీరోతో సెట్స్ కు వెళ్తారు అన్నది చూడాలి.















































