ఆద‌ర్శ కుటుంబం: సినీజోష్ రివ్యూ

Cinejosh Review: Aadarsha KutumbamCinejosh Review: Aadarsha Kutumbam

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక అనగానే టాలీవుడ్‌లో  అంచనాలు తారాస్థాయిలో  ఉంటాయి. `నువ్వు నాకు నచ్చావ్`, `మల్లీశ్వరి` లాంటి క్లాసిక్స్ తర్వాత దశాబ్దాల కాలానికి ఇద్ద‌రి కలయికలో తెరకెక్కిన తాజా చిత్రం `ఆదర్శ కుటుంబం`. శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, సత్య తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఏ రేంజ్‌లో అలరించిందో చూద్దాం.

ఆద‌ర్శ కుటుంబం స్టోరీ:
చిట్టిబాబు (వెంకటేష్)  సాధారణ మధ్యతరగతి వ్యక్తి. ఉద్యోగం కోల్పోవడం, భార్య చేసిన అప్పులు తీర్చడం, కొడుకు సర్జరీకి డబ్బులు అవసరం కావడం వంటి అనేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటాడు. సరిగ్గా అలాంటి క్లిష్ట సమయంలో చిట్టిబాబు కుటుంబానికి అనుకోకుండా వంద కోట్ల లాటరీ తగులుతుంది. ఆ డబ్బు చేతికి అందేలోపు వారు ఒక లగ్జరీ విల్లాలోకి మారుతారు. అయితే అంత భారీ మొత్తంలో లాటరీ తగిలిందన్న విషయం బయటకు పొక్కడంతో చందన్ అనే డేంజరస్ దొంగల ముఠా వారి ఇంటిపై కన్నేస్తుంది. ఆ గ్యాంగ్ నుంచి చిట్టిబాబు కుటుంబం తమను తాము ఎలా కాపాడుకుంది? ఆ తర్వాత అసలు ఏం జరిగింది? అనేదే ఈ చిత్ర అసలు కథ.

ఆద‌ర్శ కుటుంబం ప్లస్ పాయింట్లు:

వెంకటేష్ కామెడీ టైమింగ్: సినిమాకు అతిపెద్ద బలమే వెంకీ మామ యాక్టింగ్. కష్టాల్లో ఉన్న మధ్యతరగతి వ్యక్తిగా, చిలిపి తదనాలతో ఆయన పండించిన వినోదం సినిమాను నిలబెట్టింది.

త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ & కామెడీ: కథాకథనాలు రొటీన్‌గా  అనిపించినా? త్రివిక్రమ్ రాసిన పంచ్ డైలాగ్స్ మరియు ఫన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. ప్రత్యేకించి పోలీస్ స్టేషన్లో విచారణ జరిగే సీన్లో సత్యతో కలిసి వెంకీ చేసిన కామెడీ నవ్వులు పూయిస్తుంది.

నటీనటుల పెర్ఫార్మెన్స్: శ్రీనిధి శెట్టి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. నారా రోహిత్, రావు రమేష్ తమ పరిధి మేరకు మెప్పించారు. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది.

ఆద‌ర్శ కుటుంబం మైనస్ పాయింట్లు:

రొటీన్ కథ - లాజిక్ లెస్ సెటప్: సినిమా కథాంశం చాలా సాధారణంగా ఉంటుంది. పైగా స్క్రీన్ ప్లేలో లాజిక్స్ మిస్సయ్యాయి. హీరో ఫ్యామిలీ బ్యాక్‌స్టోరీ కొద్దిగా కృత్రిమంగా, సిల్లీగా అనిపిస్తుంది.

అంచనాలు: వెంకీ-త్రివిక్రమ్ కాంబో అనగానే ప్రేక్షకులు `నువ్వు నాకు నచ్చావ్` స్థాయి మ్యాజిక్‌ను ఆశిస్తారు. ఆ భారీ అంచనాలతో థియేటర్‌కు వెళితే మాత్రం కొద్దిగా నిరాశ తప్పదు.

ఆద‌ర్శ కుటుంబం విశ్లేషణ:

`ఆదర్శ కుటుంబం` చిత్రం మేకింగ్ దశ నుంచే రకరకాల వార్తలతో ప్రచారంలో నిలిచింది. దర్శకుడు త్రివిక్రమ్ తనదైన మాటలతో కథను రక్తి కట్టించే ప్రయత్నం చేసినా? బలమైన భావోద్వేగాలు  ..పకడ్బందీ లాజిక్స్ లోపించాయి. అయితే లాజిక్‌లను పక్కన పెట్టి చూస్తే.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు కావలసిన టైమ్ పాస్ వినోదం మాత్రం ఇందులో పుష్క‌లంగా దొరుకుతుంది. ఫస్ట్ హాఫ్ వేగంగా సాగిపోవడం, ఇంటర్వెల్ ట్విస్ట్ .. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని కామెడీ సీన్లు సినిమాను కాపాడుతాయి. రవి.కె.చంద్రన్ విజువల్స్ సినిమాకు రిచ్ లుక్ తెచ్చాయి.

సినిమాలో కామెడీ పండించడంలో త్రివిక్రమ్ ప్రతిభను మరోసారి చాటుకున్నా? ఎమోషనల్ కనెక్ట్ విషయంలో మాత్రం కొంత తడబడ్డారనే చెప్పాలి. ముఖ్యంగా చిట్టిబాబు కుటుంబం ఎదుర్కొనే ఆర్థిక సమస్యలు, ఆకస్మికంగా తగిలిన వంద కోట్ల లాటరీ చుట్టూ నడిచే డ్రామా మరింత బలంగా ఉంటే సినిమా స్థాయి వేరేలా ఉండేది. క్రైమ్ థ్రిల్లర్ .. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జోనర్లను మిక్స్ చేసే ప్రయత్నంలో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే గాడి తప్పినట్లు అనిపిస్తుంది. అయినా? వెంకటేష్  ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో ఆ లోపాలన్నింటినీ కవర్ చేస్తూ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సఫలమయ్యారు.

ఆద‌ర్శ కుటుంబం తీర్పు:
కాంబో మీద భారీ అంచనాలు పెట్టుకోకుండా కేవలం వీకెండ్‌లో కుటుంబంతో కలిసి సరదాగా నవ్వుకోవడానికి వెళ్తే ఆదర్శ కుటుంబం ఓసారి హాయిగా చేసేయోచ్చు.

రేటింగ్: 2.5/5

Aadarsha Kutumbam Movie Review