BB10: రోహిత్ ఇజ్జత్ తీసిన అమన్

Bigg Boss Telugu 10 : Rohit vs AmanBigg Boss Telugu 10 : Rohit vs Aman


గత రెండు రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో BB హోటల్ టాస్క్ జరిగింది. అందులో వర్షిణికి ఎక్కువ స్టార్స్ ఉండడంతో ఆమె గ్రీన్ లెవల్ కి వెళ్లి నామినేషన్స్ నుంచి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ నుంచి బయటపడిపోయింది. దానితో ముఖేష్ ఫుల్ హ్యాపీ. రామ్ ప్రసాద్ దగ్గర ఎక్కువ స్టార్స్ ఉన్నాయి.. అతను గ్రీన్ కి వెళ్ళాడు. వంశి దగ్గర ఎక్కువ మనీ ఉండడంతో అతను రెడ్ నుంచి ఎల్లో లెవల్ కి వెళ్ళాడు.

దానితో రోహిత్ మొహం మాడిపోయింది. ముఖేష్ అయితే త్రిగుణ ఇప్పటికి వంశి గురించి భయపడుతున్నాడు అన్నాడు. ఇక వర్షిణి గ్రీన్ కి వెళ్ళింది అనగానే త్రిగుణ ఫేస్ మాడిపోయింది, షాకైపోయాడు అంటూ రోహిత్ వర్షిణి తో అన్నాడు. ఈరోజు ఎపిసోడ్ లో అమన్ కి రోహిత్ కి అర్గ్యూ బాగా జరిగింది.

టాస్క్ లో అమన్ ని తీసేసి ఝాన్సీ ని పెట్టమని రోహిత్ అనగానే నువ్ ఎవరు చెప్పడానీకి అంటూ అమన్ రోహిత్ పైకి వెళ్ళాడు, నువ్వు(త్రిగుణ) వెనకుండి ఆడుతున్నావ్ అని రోహిత్ అంటే.. అవును నువ్ ఇప్పటివరకు అసలేం ఆడావ్, నువ్ సెల్ఫిష్, నువ్ కన్నింగ్ అంటూ అమన్ రోహిత్ పై రెచ్చిపోయి మాట్లాడాడు.

నేను ఫస్ట్ గొట్ అయ్యా, నువ్ ఏం ఆడావో చూపించు అంటూ రోహిత్ ని అమన్ నిలదీసాడు. దానికి రోహిత్ అమన్ పై అరిచేయ్యగానే నువ్ ముందు బ్లాక్ బ్యాడ్జ్ తీయించుకో అంటూ అమన్ రోహిత్ పై అరిచిన వీడియో చూసి అగ్నిపరీక్ష బ్యాచ్ లో వాళ్లలో వాళ్ళకే పడడం లేదు అంటూ ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు. 

Bigg Boss Telugu 10