చప్పుడు చెయ్యని కల్ట్

Vishwak Sen Cult in silent modeVishwak Sen Cult in silent mode

 

విశ్వక్ సేన్ హీరోగానే కాదు దర్శకుడిగా మారి తెరకెక్కించిన కల్ట్ చిత్రం మొదటినుంచి ఏ సర్టిఫికెట్ మూవీగానే కనిపించింది. విశ్వక్ సేన్ మళ్లీ ట్రాక్ లోకి రావాలంటే కల్ట్ హిట్ కంపల్సరీ. ప్రస్తుతం డౌన్ లో ఉన్న విశ్వక్ సేన్ హోప్స్ అన్ని కల్ట్ పైనే పెట్టుకున్నాడు. క్లాస్ మూవీ ఆదర్శ కుటుంబంతో పోటీకి దిగి కల్ట్ ని బాగానే ప్రమోట్ చేసి ఆడియన్స్ లోకి తీసుకేళ్లాడు విశ్వక్.

కల్ట్ ఈరోజు అక్టోబర్ 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే కల్ట్ సందడి ఎక్కడా కనిపించడం లేదు. కనీసం ఓవర్సీస్ షోస్ రెస్పాన్స్ కానీ ఏది లేదు, ముందుగానే కల్ట్ కి ప్రీమియర్స్ వద్దు అని ఫిక్స్ అయ్యి నిర్మాతలు మంచి పని చేశారు. లేదంటే ప్రీమియర్స్ కి వస్తున్న టాక్ తో ఓపెనింగ్స్ పోతున్నాయి.

అందులోను కల్ట్ మూవీని వీక్ హార్ట్స్, చిన్న పిల్లలు చూడొద్దు అని చెప్పాక ఫ్యామిలీ ఆడియన్స్ ఎట్టి పరిస్తితుల్లో కల్ట్ కి కనెక్ట్ కారు.కనీసం మాస్ ఆడియన్స్ అయినా కల్ట్ కోసం థియేటర్స్ కి కదలాలి, కానీ చాలామందిలో కల్ట్ టాక్ చూసి వెళదాంలే అనే ఉద్దేశ్యంలో కనిపిస్తున్నారు. అందుకే కల్ట్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ హడావిడి కనిపించడం లేదు.

Vishwak Sen's Cult