ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Perfect lip-sync... aiming for a record in dubbed films!

పర్‌ఫెక్ట్ లిప్-సింక్..డబ్బింగ్ సినిమాల్లో రికార్డుకు ప్లాన్!

Perfect lip-sync... aiming for a record in dubbed films!Perfect lip-sync... aiming for a record in dubbed films!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు దిగ్గజ దర్శకుడు నితీష్ తివారీ మైథలాజికల్ వండర్ `రామాయణం`  చిత్రంతో సిద్ధమవుతున్నారు. రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న  సినిమాను అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ భారీ ప్లాన్ రూపొందించారు. అందులో భాగంగా ఇతర భాషల డబ్బింగ్ సినిమాల్లో సాధారణంగా కనిపించే లిప్-సింక్  లోపాలకు చెక్ పెడుతూ ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందేలా వినూత్న ప్రయోగం చేస్తున్నారు.

ఈ చిత్రం కోసం `బ్రహ్మ ఏఐ` పేరుతో రూపొందించిన అత్యంత ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ DNEG - ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా నేతృత్వంలో అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత ద్వారా నటులు మాతృభాషలో చెప్పిన సంభాషణల పెదవుల కదలికలను  ఇతర భాషల డబ్బింగ్‌కు అనుగుణంగా రీ-మ్యాప్ చేస్తారు. దీంతో నటులు ఇతర భాషల్లో నేరుగా మాట్లాడినట్లే కనిపించడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత.

సాధారణంగా డబ్బింగ్ సినిమాల్లో వినిపించే వాయిస్‌కి.. నటుల పెదవుల కదలికలకు పొంతన ఉండక ప్రేక్షకులు ఆ పాత్రల్లో ఒదిగిపోవడానికి కాస్త ఇబ్బంది పడుతుంటారు. కానీ `రామాయణం`లో  `వాణి` విజువల్ ఏఐ సిస్టమ్ ద్వారా ఒరిజినల్ నటుల ఎమోషన్స్, ఎక్స్‌ప్రెషన్స్ ఏమాత్రం దెబ్బతినకుండా పర్‌ఫెక్ట్ లిప్-సింక్ సాధించారు. ఈ సాంకేతికతతో ఇంగ్లీష్‌తో పాటు ఇతర అంతర్జాతీయ, ప్రాంతీయ భాషల్లో విడుదలయ్యే వర్షన్లలోనూ నటులు స్వయంగా ఆయా భాషలు మాట్లాడుతున్న భావన ప్రేక్షకులకు కలుగుతుంది.

ఇప్పటికే విడుదలైన `రామాయణం` ఇంగ్లీష్ ట్రైలర్‌లో  బ్రహ్మ ఏఐ మేజిక్ స్పష్టంగా కనిపించింది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో సినీ ప్రియులను ఆశ్చర్యపరిచింది. భారతీయ సినిమా సాంకేతిక ప్రమాణాలను గ్లోబల్ లెవెల్‌కి తీసుకెళ్తున్న  డబ్బింగ్ టెక్నాలజీ భవిష్యత్తులో బహుభాషా చిత్రాల మేకింగ్ శైలిని పూర్తిగా మార్చేస్తుంద‌ని విశ్లేషకులు భావిస్తున్నారు.

Dubbed films!