ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Speculation over God of War female lead

గాడ్ ఆఫ్ వార్ లో ఎన్టీఆర్ కి జోడిగా ఆమేనా?

Speculation over God of War female leadSpeculation over God of War female lead


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో కలిసి డ్రాగన్ షూట్ లో తలమునకలై ఉన్నారు. ఎన్టీఆర్ భుజానికి తగిలిన గాయం, తర్వాత జరిగిన సర్జరీ తో ఆయన దాదాపుగా ఎనిమిదివారాల రెస్ట్ తర్వాత రీసెంట్ గానే డ్రాగన్ సెట్ లో అడుగుపెట్టారు. వచ్చే ఏడాది జూన్ టార్గెట్ గా తెరకెక్కుతున్న డ్రాగన్ షూట్ ని నీల్ శరవేగంగా చిత్రీకరిస్తున్నారు.

హీరో గాయం కారణంగా సినిమా పోస్ట్ పోన్ అవ్వకూడదు అని నీల్ తదుపరి షెడ్యూల్స్ పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గాడ్ ఆఫ్ వార్ కి కమిట్ అయ్యారు, ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి తారక్ కి వినిపించినట్లుగా చెప్పారు.

అయితే ఈ చిత్రంలో తారక్ సరసన హీరోయిన్ గా అలియా భట్ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే డ్రాగన్ చిత్రంలో అలియా భట్ ఓ గెస్ట్ రోల్ ప్లే చేస్తుంది వార్తల నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో లో మొదలు కాబోయే గాడ్ ఆఫ్ వార్ లోను ఈ బాలీవుడ్ బ్యూటీనే త్రివిక్రమ్ కన్సిడర్ చేస్తున్నారనే న్యూస్ నడుస్తుంది. 

Is she the female lead in God of War