ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vijay Sethupathi Reportedly To Play Key role In RC17

ఈసారి సుకుమార్ కి విజయ్ ఓకే చెబుతాడా?

Vijay Sethupathi Reportedly To Play Key role In RC17Vijay Sethupathi Reportedly To Play Key role In RC17


పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ తో చెయ్యబోయే #RC17 ప్రీ ప్రొడక్షన్ లో అలాగే లొకేషన్స్ వేటలో బిజీగా వున్నారు. నవంబర్ 1 న #RC17 ప్రోజెక్ట్ పూజా కార్యక్రమాలతో మొదలు కాబోతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా సారా అర్జున్ ని ఫిక్స్ చేసారు అనే టాక్ ఉంది, రుక్మిణి వసంత్ ని కూడా కన్సిడర్ చేస్తున్నారనే టాక్ నడుస్తుంది.

అయితే #RC17 లో ఓ కీలక పాత్ర కోసం సుకుమార్ కోలీవుడ్ స్టార్ హీరో ని తీసుకొచ్చేందుకు గట్టిగా ప్లాన్ చేసారని.. అది కూడా విజయ్ సేతుపతి ని #RC17 కోసం అడుగుతున్నారని తెలుస్తుంది. గతంలో సుకుమార్ విజయ్ సేతుపతి పుష్ప కోసం తీసుకున్నారు. రెమ్యునరేషన్ అన్ని మట్లాడుకుని ఓకే చేసాక విజయ్ సేతుపతి పుష్ప నుంచి తప్పుకున్నారు.

ఇప్పుడు సుకుమార్ రామ్ చరణ్ తో చెయ్యబోయే #RC17 కోసం విజయ్ సేతుపతితో చర్చలు జరుపుతున్నారనే వార్త చూసి ఈసారి సుక్కు కు విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అని మాట్లాడుకుంటున్నారు. ఏ విషయము నవంబర్ 1 న పూజా కార్యక్రమాల రోజునే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది తెలుస్తుంది. 

RC17 update