ఈసారి జాగ్రత్త పడకపోతే కష్టమే విజయ్!
VIjay Deverakonda focus on Rowdy Janardhana
చాలామంది హీరోలు మాస్ మాస్ అంటూ మూస కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మాస్ ఇమేజ్ తో త్వరగా ఆడియన్స్ లో క్రేజీగా మరోచ్చనేది వారి ప్లాన్. కానీ మాస్ ఇమేజ్ కోసం ఆరాటపడిన హీరోలలో ఎక్కడో ఒకరు మాత్రమే క్లిక్ అవుతున్నారు. ఇక మాస్ కథల్లో యాక్షన్ ఎక్కువైతే అది ట్రోల్స్ కి దారి తీస్తుంది.
సోషల్ మీడియాలో ఎంత త్వరగా ఫేమస్ అవుతున్నారో అంతే త్వరగా కిందకు పడిపోతున్నారు. రీసెంట్ గా నాని ప్యారడైజ్ చిత్రానికి, విజయ్ దేవరకొండ రణబాలి చిత్రానికి వచ్చిన ట్రోల్స్ ఒకేమాదిరి కనిపించాయి. విజయ్ దేవరకొండ రణబాలి పై వచ్చిన నెగిటివిటి చూస్తే ఈ సినిమా అట్టర్ ప్లాప్ అనుకున్నారు.
కానీ విజయ్ దేవరకొండ, రష్మికలు చాలా కష్టపడి ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించడంతో రణబాలి చాలా ఏరియాల్లో సేఫ్ అయ్యింది. ఒకటిరెండు తప్ప మిగిలిన ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇక విజయ్ దేవరకొండ రణబాలి నుంచి బయటికి వచ్చి రవి కిరణ్ కోలా రౌడీ జనార్ధన పై ఫోకస్ పెట్టాలి.
రౌడీ జనార్ధన కూడా టైటిల్ కి తగ్గట్టే మాస్ లక్షణాలున్న కథతో తెరకెక్కుతుంది. ఇందులో మితిమీరిన రక్తపాతం, చిరాకు తెప్పించే యాక్షన్ లేకుండా జాగ్రత్త పడకపోతే ఈసారి సోషల్ మీడియా ట్రోల్స్ నుంచి ఎవరూ విజయ్ దేవరకొండ ను కాపాడలేరు. విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ విషయంలో తగిన జాగ్రత్తలు, సోషల్ మీడియా ట్రోల్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని పెర్ఫెక్ట్ గా చూసుకోవాలి. లేదంటే కష్టమే మరి.!
















































