ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rashmika reacts to Vijay Deverakonda separation rumours

విడాకుల పుకార్ల పై రష్మిక అసహనం

Rashmika reacts to Vijay Deverakonda separation rumoursRashmika reacts to Vijay Deverakonda separation rumours


చాలామంది సెలబ్రిటీ కపుల్స్ పై సోషల్ మీడియాలో ఎంత మంచి కామెంట్స్ వస్తాయో.. ఒక్కోసారి అంతకుమించిన నెగెటివ్ కామెంట్స్, ట్రోల్స్ వస్తూ ఉంటాయి. ఈ ఏడాది ప్రేమ పెళ్లి చేసుకున్న టాప్ హీరోయిన్ రష్మిక, హీరో విజయ్ దేవరకొండలు పెళ్లి తర్వాత రణబాలి చిత్ర ప్రమోషన్స్ లో మీడియాలో బాగా హైలెట్ అయ్యారు.

రీసెంట్ గా బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ షో లో విజయ్ దేవరకొండ-రష్మిక లు పాల్గొన్నారు, ఆ షో తర్వాత భార్య భర్తలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలు కావడమే కాదు, వారిద్దరూ త్వరలోనే విడాకులు కూడా తీసుకోబోతున్నారంటూ ప్రచారం కూడా చేస్తున్నారు. దానితో రష్మిక అసహనానికి గురైంది.

సోషల్ మీడియా వేదికగా తమ జంట పుకార్లు వ్యాప్తి చేస్తున్న వారికి స్ట్రాంగ్ గా ఇచ్చిపడేసింది.

తమపై కామెంట్స్ పిచ్చి పిచ్చి చేస్తున్న వారికీ రష్మిక క్లారిటీ ఇచ్చేసింది. విజయ్‌తో పెళ్లి విషయంలో ఇద్దరం ఒకరినొకరం కావాలనుకున్నాం, అందుకే పెళ్లి ని ఎంచుకున్నాం, ప్రేమలో ఉన్నపుడు పెళ్లి కోసం విజయ్‌కు సమయం కావాలనడంలో తప్పేముంది, మా ప్రేమను ప్రపోజల్స్‌తో కొలవలేరు.

నాకు విజయ్‌పై పిచ్చి ప్రేమ ఉంది.. అందులో తప్పేముంది, పెళ్లి చేసుకునే వ్యక్తిని ప్రేమించకపోతే ఎందుకు పెళ్లి చేసుకోవాలి, విజయ్ నా స్నేహితుడు.. అంతకుమించి నా జీవిత భాగస్వామి, మా వ్యక్తిగత జీవితంపై అనవసరమైన వ్యాఖ్యలు, రాద్ధాంతం వద్దు. మా ఇంటర్వ్యూను టార్గెట్ ఎందుకు, నేను విజయ్‌కు మళ్లీ మళ్లీ పెళ్లి ప్రపోజల్ చేస్తా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ రష్మిక చాలా సీరియస్ గా ట్రోలర్స్ కి ఇచ్చిపడేసింది. 

Rashmika Mandanna breaks her silence on the backlash over her marriage to Vijay Deverakonda